Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

షూటింగ్ కోసం సిద్ధం అవుతున్న రజినీ కాంత్ 'కబాలి 2'


సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా భారీ అంచనాలతో విడుదల అయ్యి నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రజనీకాంత్ కబాలి దర్శకుడు పా. రంజిత్ కు మరో అవకాశం ఇచ్చాడు అది కూడా కబాలి 2 కి . దాంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది . హిట్ ఇచ్చిన దర్శకుడికి ఛాన్స్ ఇస్తారు కానీ ప్లాప్ ఇచ్చిన దర్శకుడి కి వెంటనే మరో ఛాన్స్ ఇవ్వడం ఏంటి ? అని ఆశ్చర్య పోతున్నారు . ఇక ఈ సినిమాని నిర్మించేది ఎవరో కాదు, రజనీ అల్లుడు హీరో ధనుష్ . అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న సినిమా అవటంతో... ఆలస్యం చేయకుండా ఈ సినిమా కోసం వెంటనే సెట్స్ పైకి వెళ్లేలా డేట్స్ ఇచ్చాడు రజనీ కాంత్.

 

ఇక ఈ సినిమాలో కూడా రజనీ తెల్లని గడ్డం తో కనిపించనున్నట్లు సమాచారం. రజనీ గెటప్ కి సంబందించిన పనులు పూర్తి చేసే పనిలో పడ్డారట నిర్మాత ధనుష్ , దర్శకుడు పా రంజిత్ లు. ఇక ఈ సినిమా వచ్చే నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీ సరసన బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటించనుంది.