Jr.NTR Next Is A Thriller


థ్రిల్ల‌ర్ క‌థ‌తో రానున్న‌ తార‌క్
 
ఎప్పుడూ పాత చింత‌కాయ ప‌చ్చ‌డిని తెచ్చి రుబ్బే టాలీవుడ్ లో అస‌లు థ్రిల్ల‌ర్ సినిమాలు రావ‌డ‌మే అరుదు. అలాంటిది స్టార్ హీరోల నుంచి అలాంటి సినిమాలు ఊహించ‌డం అత్యాశే అవుతుంది. ఏమాట‌కి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ మ‌ధ్య మ‌న తెలుగు సినిమాల్లో చాలా మార్పు క‌నిపిస్తోంది. స్టార్స్ అంద‌రూ డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ ని ఎంచుకుంటూ, ఇంత‌వ‌ర‌కు తాము చేయ‌ని జోన‌ర్ల‌లో సినిమాలు చేస్తూ.. స‌క్సెస్ దిశ‌గా అడుగులేస్తున్నారు.
ఒక‌ప్పుడు కేవ‌లం మాస్, యాక్ష‌న్ సినిమాలే చేసుకుంటూ వచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్.. టెంప‌ర్, నాన్న‌కుప్రేమ‌తో లాంటి వెరైటీ సినిమాల‌తో త‌ను ఎలాంటి సినిమానైనా చేయ‌గ‌ల‌డ‌నే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో క‌లిగించాడు. ఈ రెండు సినిమాల‌తో త‌న ఇమేజ్ ను చాలా వ‌ర‌కు మార్చుకున్న ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే కంప్లీట్ థ్రిల్ల‌ర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. చాలా కాలం నుంచి మెగాఫోన్ ప‌ట్టాల‌ని చూస్తున్న వ‌క్కంతం వంశీ, ఎన్టీఆర్ కాంబినేష‌న్లో సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ కోసం వంశీ మంచి థ్రిల్ల‌ర్ స్టోరీలో ఎమోష‌న‌ల్ టచ్ ఉండే క‌థ‌ను రెడీ చేస్తున్నాడ‌ట‌.
ప్ర‌స్తుతం జ‌న‌తా గ్యారేజ్ సినిమా చేస్తున్న జూనియ‌ర్ ఆ సినిమా పూర్త‌య్యి, ఈ సినిమా మొద‌ల‌య్యే స‌రికి క‌నీసం ఇంకో మూడు నెల‌లైనా ప‌డుతుంది. పూర్తిస్థాయి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కనున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ స్వ‌యంగా నిర్మించ‌నుండ‌టం విశేషం.