Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

అమ్మ రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో జె.డి.చ‌క్ర‌వ‌ర్తి హీరోగా చిత్రం ప్రారంభం.


జె.డి.చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌త హీరో హీరోయిన్లుగా న‌క్ష‌త్ర మీడియా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్ సార‌థి స్టూడియోలో ప్రారంభ‌మైంది. అమ్మ రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌క్ష‌త్ర రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌గా సినిమా రూపొంద‌నుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....
ద‌ర్శ‌కుడు అమ్మ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - సినిమా ద‌ర్శ‌క‌త్వం చేసి చాలా గ్యాప్ వ‌చ్చింది. అయితే వ‌స్తే చాలా మంచి సినిమాతోనే రావాల‌ని ప‌క్కా ప్లానింగ్‌తో ఈ సినిమా చేస్తున్నాను. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తున్నాం. ర‌ణం సినిమాలో గోపీచంద్ ఎంత బాగా యాప్ట్ అయ్యాడో ఈ సినిమాలో క‌థ‌కు జె.డి.చ‌క్ర‌వ‌ర్తిగారు అంత‌లా యాప్ట్ అవుతారు. జె.డి గారు న‌న్ను డ్యాన్స్ మాస్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేసిన గురువుగారు. అలాగే నిర్మాత‌లు నాకు మంచి స్నేహితులు. అంజిశ్రీను సినిమాటోగ్ర‌ఫీ, థ‌మ‌న్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్ల‌స్ అవుతాయి.. అని అన్నారు.
జె.డి.చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ - అమ్మ రాజ‌శేఖ‌ర్ క‌థ చెప్ప‌గానే నేను కొన్ని క‌రెక్ష‌న్స్ చెప్పాను. త‌ను నేను చెప్పిన చేంజ‌స్‌తో సినిమాను అద్భుతంగా రాసుకుని వ‌చ్చాడు. క‌థ‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అమ్మ రాజ‌శేఖ‌ర్ భావాన్ని గొప్ప‌గా చెప్ప‌గ‌ల ద‌ర్శ‌కుడు. రామ్‌గోపాల్‌వ‌ర్మ‌గారి వ‌ద్ద ప‌నిచేసిన అంజి శ్రీను ఈసినిమాకు సినిమాటోగ్ర‌ఫీ చేయ‌డం, థ‌మ‌న్ మ్యూజిక్ అందించ‌డం హ్యాపీగా ఉంది..అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ అంజి శ్రీను, శ్రీరామ్‌చంద్ర‌, హీరోయిన్ అక్ష‌త త‌దిత‌రులు పాల్గొన్నారు.