17న జ‌యాన్ని నిశ్చ‌యించ‌నున్న క‌మెడియ‌న్


శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". "సమైక్యంగా నవ్వుకుందాం" అనే ట్యాగ్ లైన్ తో.. "దేశవాళీ వినోదం" అనే సరికొత్త నినాదంతో సందడి చేస్తూ.. అందరి దృష్టినీ అమితంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం నవంబర్ 17న విడులవుతోంది. ఈ చిత్రం హక్కులు ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ 7 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సంస్థ ఇంతకుముందు విక్రమ్-నయనతార నటించిన "ఇంకొక్కడు" చిత్రాన్ని నిర్మించింది. దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి మాటాడుతూ.. "మా సినిమా పాట చూసి సినిమాను ప్రమోట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ గారికి.. సినిమా నచ్చి, ఈ చిత్రం హక్కులు తీసుకున్న "ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్" నీలం కృష్ణారెడ్డిగారికి కృతజ్ఞతలు. "జయమ్ము నిశ్చయమ్మురా"ను నవంబర్ 17న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఏ.వి.ఎస్.రాజు, నిర్మాతలు: సతీష్ కనుమూరి-శివరాజ్ కనుమూరి, కథ-దర్శకత్వం: శివరాజ్ కనుమూరి !!