జనసేన పతాక ఆవిష్కరణ


జనసేన పార్టీ ఆవిర్భవించి మూడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పార్టీ పరిపాలన కార్యాలయం లో  పతాక ఆవిష్కరణ జరిగింది. పార్టీ మీడియా హెడ్ శ్రీ పి. హరి ప్రసాద్  పార్టీ జెండా ఎగురవేశారు. భరత  మాత చిత్ర పటం వద్ద పార్టీ ఉపాధ్యక్షుడు,తెలంగాణ పార్టీ వ్యవహారాల సమన్వయకర్త శ్రీ బి. మహేంద్ర రెడ్డి,పార్టీ తెలంగాణ విభాగం ఇంచార్జి శ్రీ ఎన్.శంకర్ గౌడ్ పూజలు చేసారు. పార్టీ నాయకుల నినాదాల మధ్య నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులుశ్రీ అర్హం ఖాన్ , శ్రీ నగేష్,శ్రీ రియాజ్,శ్రీ నరసింహ  తదితరులు పాల్గొన్నారు.