Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

Jakkanna Compleated Songs in Dubai


                       దుబాయ్ లో సాంగ్స్ పూర్తిచేసుకున్న 
          గోల్డెన్‌స్టార్ సునీల్‌ 'జ‌క్క‌న్న' 
గోల్డెన్‌స్టార్‌ సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్ లోని అంద‌మైన లోకేష‌న్స్ లో జానీ మాస్ట‌ర్ కొరియోగ్రాఫ‌ర్ గా సాంగ్ షూటింగ్ జ‌రుపుకుంది. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ వారంలో వైజాగ్ లో జ‌రిగే సాంగ్ చిత్రీక‌ర‌ణ తో షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్త‌వుతుంది. రెండ‌వ వారంలో ఆడియో విడుద‌ల చేసి జులై లో చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌దల చేయటానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...... సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్కిస్తున్న మా చిత్రం జ‌క్క‌న్న ఇటీవ‌లే దుబాయ్ లో సాంగ్ షూటింగ్ జ‌రుపుకుంది. ఈ వారంలోనే మ‌రో సాంగ్ చిత్రీక‌ర‌ణ చేస్తాము. దీంతో షూటంగ్ మెత్తం పూర్త‌వుతుంది. మాహీరో సునీల్ పెర్ ఫార్మెన్స్ లో అన్ని ర‌కాల షెడ్స్ వుంటాయి. సునీల్ గారి కామెడి టైమింగ్ కి డైర‌క్ట‌ర్ వంశి రాసిన సీన్ కి ధియోట‌ర్స్ లో క్లాప్స్ ప‌డ‌తాయి. మా  డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. మా చిత్రంలో ఊహించని ట్విస్ట్ లు చాలా వుంటాయి. హీరోయిన్ మ‌న్నార్ చోప్రా పాత్ర కూడా చాలా అందంగా తీర్చిదిద్దాడు మా ద‌ర్శ‌కుడు. అలాగే మా చిత్రం ప్రేమ‌క‌థా చిత్రం లో స‌ప్త‌గిరి ఏ రేంజిలో న‌వ్వించాడో ఈ చిత్రంలో దాన్ని మించి న‌వ్విస్తాడు. స‌ప్త‌గిరి మంచి గెట‌ప్ లో క‌నిపిస్తాడు. రెండ‌వ వారంలో ఆడియో విడుదల చేసి,  జులైలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు.
నటీనటులు
సునీల్, మన్నార్ చోప్రా, కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, ప్ర‌భాస్ శీను, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, సత్య ప్రకాష్, రాజా రవీంద్ర, ఉదయ్, ఆనంద్ రాజ్, సత్య, వైవా హర్ష, వేణుగోపాల్, రాజశ్రీ నాయర్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - ఆర్ పి ఏ క్రియేషన్స్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్,
మ్యూజిక్: దినేష్,
ఆర్ట్ డైరెక్టర్ - మురళి,
ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్,
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ,
డైలాగ్స్: భవాని ప్రసాద్,
స్టిల్స్ - వాసు
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి,
నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.