Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Jaggu Bhai to Play Key Role In KalyanRam, Puri Movie


15ఏళ్ల త‌ర్వాత పూరీ-జ‌గ‌ప‌తి కాంబినేష‌న్..

సడెన్‌గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జగపతిబాబు ఎప్పుడైనా నటించాడా అని అడిగితే.. చాలామంది లేదనే సమాధానం ఇచ్చేస్తారు. వాళ్లిద్దరూ కలిసి ‘బాచి’ అనే సినిమా చేసిన సంగతి చాలామందికి గుర్తుండదు. తన తొలి సినిమా ‘బ్రది’ తర్వాత పూరి తీసింది ఈ సినిమానే. తొలి సినిమాతో తెచ్చుకున్న పేరంతా ఈ సినిమాతో పోగొట్టుకున్నాడు పూరి. ఆపై వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. మ‌ళ్లీ ఇన్నాళ్ల త‌ర్వాత వీరిద్ద‌రూ జత‌కానున్నారు.
హీరోగా త‌న ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన జ‌గ‌ప‌తిబాబు మ‌ధ్య‌లో హీరోగా పూర్తిగా ఫేడ‌వుట్ అయిపోయాడు. పూరి స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగిపోయాడు. ఐతే ఈ మధ్యే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారాల్లోకి మారిన జగపతి.. మళ్లీ పీక్స్ అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది కళ్లు జగపతి మీద పడ్డాయి.ఇంతకుముందు పరభాషా నటులతో చేయించే క్యారెక్టర్లను ఇప్పుడు జగపతికి ఆఫర్ చేస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబును దృష్టిలో పెట్టుకుని స్పెషల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తున్నారు డైర‌క్ట‌ర్లు. అలాగే పూరీ కూడా జగపతి కోసం ఒక క్యారెక్టర్ తయారు చేశాడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించబోతున్న కొత్త సినిమాలో జగపతికి కీలకమైన పాత్ర ఆఫర్ చేశాడు. అతనూ ఒప్పుకున్నాడు. పూరి లాస్ట్ హిట్ ‘టెంపర్’లో పోసాని కృష్ణమురళి చేసిన మూర్తి పాత్రను తాను చేస్తే బాగుండేదని జగపతి ఆ మధ్య అన్నాడు. ఆ మాట విన్నాకే పూరి ఇన్‌స్పైర్ అయి.. ఈ క్యారెక్టర్ రాశాడో ఏమో. మొత్తానికి దాదాపు 15సంవ‌త్స‌రాల తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ తెరమీదికి వస్తుండటంతో అంద‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తుతుంది.