Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Its O'Range' Army Victory


ఆరెంజ్ ఆర్మీ కాదు.. ఓ రేంజ్ ఆర్మీ
ఈ సీజ‌న్ లో రెండు వ‌రుస ఓట‌మిల‌తో మొద‌లుపెట్టి చివ‌రికి ఛాంపియ‌న్ గా నిలుస్తుంద‌ని ఎవ‌రైనా ఊహిస్తారా.. అంతే మ‌రి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఊహ‌ల‌కు అంద‌దు. చివ‌ర వ‌ర‌కు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో కెప్టెన్ వార్న‌ర్ ఫామ్ తో స‌న్ రైజ‌ర్స్ ఐపీఎల్ ట్రోఫీని సాధించారు. ఈ విజ‌యాన్ని ప్ర‌తి తెలుగువాడు త‌న విజ‌యంగానే భావించారు. మ‌న తెలుగు తార‌లు కూడా ఈ విష‌యంలో ఏమీ తీసిపోలేదు. మ‌న హీరోల‌లో వెంక‌టేశ్, నిఖిల్, అఖిల్ కు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హైద‌రాబాద్ లో మ్యాచ్ జ‌రుగుతుందంటే వీళ్లు ఖ‌చ్చితంగా స్టేడియంలో ఉండాల్సిందే.టీమ్ ను స‌పోర్ట్ చేయాల్సిందే.
కాక‌పోతే నిన్న ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది హైదరాబాద్ లో కాదు. బెంగుళూర్ లో. బెంగుళూర్ అయితే వెళ్ల‌లేమా అని ఆ మ్యాచ్ కి సైతం వెంకీ, సుమంత్, అల్లు శిరీష్ వెళ్లి అక్క‌డ మ‌న హైద‌రాబాద్ టీమ్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వారి ప్రేమ‌ను తెలియ‌చెప్పింది. అస‌లు వెంకీ ఆనందానికి అయితే అవ‌ధుల్లేవు. హైద‌రాబాద్ ఆట‌గాడు క‌ట్టింగ్ కొట్టిన సిక్స్ కి వెంకీ ఇచ్చిన రియాక్ష‌న్, అల్ల‌రి బ‌హుశా త‌న సినిమాకు బ్లాక్ బస్ట‌ర్ హిట్ వ‌చ్చిన‌ప్పుడు కూడా అలా చేసి ఉండ‌డు. కంగ్రాట్స్ టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.