Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

అక్టోబర్‌ 20న నందమూరి కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల 'ఇజం'


డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌కు, ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. యూ ట్యూబ్‌లో టీజర్‌కు, ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే మోస్ట్‌ పవర్‌ఫుల్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ డిఫరెంట్‌ లుక్‌తో కనిపించబోతున్నారు. కళ్యాణ్‌రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌, పూరి జగన్నాథ్‌ టేకింగ్‌ హైలైట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సేషన్‌ క్రియేట్‌ చెయ్యడానికి సిద్ధమవుతోంది.  అక్టోబర్‌ 5న ఆడియో ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ 5న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. అనూప్‌ రూబెన్స్‌ అందించిన ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అవుతుంది. కళ్యాణ్‌రామ్‌, అనూప్‌ రూబెన్స్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ ఆడియో మ్యూజికల్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చెయ్యబోతోంది.  డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.