Latest News

`జూన్ 1: 43` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి, జూన్‌లోనే రిలీజ్‌! డీజే అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది : పూజ హెగ్డే తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న 'ఆనందో బ్రహ్మ' ఇన్నోవేటివ్ మోషన్ పోస్టర్ అన్ని ఏరియాల స్పంద‌న అద్భుతం- `ఓ పిల్లా నీ వ‌ల్లా` ద‌ర్శ‌క‌నిర్మాత కిషోర్‌ సునీల్ 'ఉంగరాల రాంబాబు' జూన్ లో విడుదల `అంధ‌గాడు` సెన్సార్ పూర్తి.. జూన్ 2న విడుద‌ల గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' జూన్ 9 న విడుదల 25 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రాజ‌శేఖ‌ర్‌ 'గరుడ వేగ 126.18 ఎమ్' జూన్ 2న వ‌స్తున్న `వెక్కిరింత‌`విడుదల ఒకేసారి రెండు మల్టీ స్టారర్ సినిమాలు కలిసి చేస్తున్న సుధీర్ బాబు & నారా రోహిత్

అవ‌స‌రాల అడ‌వి మ‌ల్టీస్టార‌ర్ స్టార్ట్స్


అర్ధవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్ మెన్" లాంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నారు. కె.సి.నరసింహారావు నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో "అంతకు ముందు ఆ తర్వాత" ఫేమ్ ఈష, అదితి మ్యానికల్ కథానాయికలుగా నటించనుండగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు (ఫిబ్రవరి 1) జరిగింది. 
a2 ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్ కొట్టగా.. వినయ్ కెమెరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించారు. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" సంస్థ అధినేత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. "నేడు పూజా కార్యక్రమాలతోపాటు రెగ్యులర్ షూట్ కూడా మొదలుపెట్టనున్నాం. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ లు కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈష, అదితి మ్యానికల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ గారు సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రానికి పి.జి.విందా కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు" అన్నారు.  తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!
 
a1