Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Horror Entertainer Sivagami


హారర్ చిత్రాలలో అగ్రగామిగా నిలవనున్న "శివగామి"
కన్నడలో ఘన విజయం సాధించిన "నాని" అనే హారర్ చిత్రం తెలుగులో "శివగామి"గా రానుంది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ భీమవరం టాకీస్ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబి సుహాసిని, జై జగదీశ్, కల్పన, రాధ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సుహాసినీమణిరత్నం ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర్రం ట్రైలర్ ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "బేబి సుహాసిని, సీనియర్ సుహాసినిల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. తెలుగులో ప్రముఖ గాయని గీతామాధురి, ఫేమస్ సింగర్ "గజల్" శ్రీనివాస్ కుమార్తె సంస్కృతీ "శివగామి"లో పాడడం విశేషం. ఈనెల 15న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. హారర్ సినిమాల్లో "శివగామి" సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే నమ్మకముంది" అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సురేష్, సంగీతం: త్యాగరాజ్-గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. శివ వై. ప్రసాద్, సమర్పణ: రమేష్ కుమార్ జైన్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుమంత్.