సుమంత్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ


ఇండ‌స్ట్రీకి అంద‌రూ విజ‌యాలు అందుకుని, మంచి స్థాయిలో ఉండాల‌నే వ‌స్తారు. కాక‌పోతే విజ‌యం కొంద‌రినీ వ‌రిస్తుంది, మ‌రికొంద‌రి ద‌గ్గ‌ర‌కు కూడా రాదు. అలా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ లు లేక‌పోయినా, హీరో సుమంత్ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్ర‌స్తుతం సుమంత్ హీరో గా గౌత‌మ్ తిన్నూరు ద‌ర్శ‌క‌త్వంలో ఓ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ కు రంగం సిద్ధం అవుతుంది. ఈ సినిమాకు హీరోయిన్స్ టాలీవుడ్ లో ఎవ‌రూ లేన‌ట్లుగా బాలీవుడ్ నుంచి మ‌రో బ్యూటీని దింపాడు సుమంత్.

ప‌లు హిందీ సీరియ‌ల్స్ లో న‌టించి, ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆకాంక్ష సింగ్, ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన‌ట్లు సుమంత్ తెలిపాడు. బ‌ద్రీనాథ్ దుల్హ‌నియా సినిమాతో మ‌రింత పాపులారిటీని ద‌క్కించుకున్న ఈ బ్యూటీకి సుమంత్ సినిమా ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో చూడాలి మ‌రి.