ఎనర్జిటిక్ హీరో కూడా ఇంత లేట్ చేస్తే ఎలా..?


మొద‌టి సినిమా దేవ‌దాసుతోనే సూప‌ర్ స‌క్సెస్ ను అందుకున్న రామ్, కెరీర్ లో త‌ర్వాత చాలానే ఒడిదుడికుల‌ను ఎదుర్కొన్నాడు. శివ‌మ్ తో దారుణ‌మైన ప‌రాజయాన్ని అందుకున్న రామ్, నేను శైల‌జ తో త‌న కెరీర్ లో చెప్పుకునే రేంజ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ప‌ర్లేదులే రామ్ మంచి దారిన ప‌డ్డాడు అనుకునే టైమ్‌లో మ‌ళ్లీ హైప‌ర్ వంటి రెగ్యుల‌ర్ సినిమాను తీసి, ఫెయిల్ అయ్యాడు. అందుకే ఈసారి ఎలాగైనా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్న ఎనర్జిటిక్ హీరో త‌న త‌ర్వాతి సినిమాకు బాగానే టైమ్ తీసుకుని, మ‌ళ్లీ కిషోర్ తిరుమ‌ల‌తోనే జ‌త క‌ట్ట‌బోతున్నాడు. 

అయితే ఈ సినిమాలో రామ్ డిఫ‌రెంట్ లుక్ లో, ఇదివ‌ర‌కెప్పుడూ చూడ‌ని విధంగా క‌నిపించబోతున్నాడ‌ట‌. దానికోసం సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తున్నాడు రామ్. కానీ ఈ సిక్స్ ప్యాక్ ట్రెండ్ అనేది ఎప్పుడో పాతబ‌డిపోయింది. టాలీవుడ్ లో చాలామంది హీరోలు  ఆల్రెడీ ఎప్పుడో ట్రై చేసేశారు. అలాంటిది రామ్ ఇప్పుడు వ‌చ్చి, త‌న బాడీతో ట్రీట్ ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతో సిక్స్ ప్యాక్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే క‌థ‌లో ఎంపిక‌లో మ‌నోడు కాస్త డ‌ల్ అనే చెప్పాలి.లేక‌పోతే అందం, డ్యాన్సులు, యాక్టింగ్ స్కిల్స్ ఇవ‌న్నీ పుష్క‌లంగా ఉంచుకుని కూడా చెప్పుకోద‌గిన రేంజ్ లో త‌న కెరీర్ గ్రాఫ్ లేదంటే అర్థ‌మేంటి? చూద్దాం ఈ సినిమాతో అయినా మాంచి స్టోరీతో వ‌చ్చి హిట్ రూట్ లోకి రావాల‌ని ఆశిద్దాం.