Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

కొత్త ట్రెండ్‌కు తెర‌లేపిన ఎన‌ర్జిటిక్ హీరో..


జనరల్‌గా సినిమా రిలీజ్‌ దగ్గర పడుతోందంటే ఆ విశేషాలు చెప్పడానికి హీరోలు మీడియాని కలుస్తుంటారు. మీడియా వేదికగా అభిమానులకు చెప్పాల్సినవి చెబుతుంటారు. అయితే సినిమా ప్రారంభం రోజునే అభిమానులకు హీరో టచ్‌లోకొస్తే, ప్రారంభోత్సవాన్ని యూట్యూబ్‌లో చూపిస్తే... ఐడియా అదిరింది కదూ. ఇది రామ్‌ ఐడియా. ఉగాది నాడు ఆయన కొత్త సినిమా ఆరంభం కాబోతోంది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్‌ హీరోగా రూపొందిన ‘నేను శైలజ’ సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌ రీపీట్‌ అవుతోంది. ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించనున్న ఈ చిత్రం ఉగాది పర్వదినాన ఆరంభం కానుంది. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు. దేవీశ్రీప్రసాద్‌ సంగీత దర్శకుడు. ఉదయం 10 గం 25 నిమిషాలకు ఈ చిత్రం ఆరంభం అవుతుంది. ఈ కార్యక్రమం ‘రామ్‌’ యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆ విధంగా ఈ చిత్రబృందం కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. అంతేకాదు ప్రారంభోత్సవం తర్వాత రామ్‌ తన అభిమానులతో ఛాట్‌ చేసేందుకు పచ్చజెండా ఉపారు. ఇంకెందుకు ఆలస్యం? రామ్‌ని ఏమేం అడగాలో డిసైడ్‌ చేసుకోండి. సమాధానాలు ఎనర్జిటిక్‌గా వస్తాయి. మరి.. రామ్‌ ఇక్కడ.