మార్పొచ్చిందంటున్న‌హైప‌ర్ హీరో


నేను శైల‌జ తో 2016 లో తెలుగు సినీ ఇండ‌స్ర్టీకి మొద‌టి హిట్ ఇచ్చిన రామ్, ఇప్పుడు హైప‌ర్ రూపంలో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. రామ్ ఇప్పుడున్న పొజిష‌న్ లో త‌న త‌ర్వాతి సినిమా విష‌యంలో జాగ్ర‌త్త‌లు చాలానే తీసుకోవాలి. అయ‌తే రామ్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌ర్వాత సినిమా విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌కపోవడంతో రామ్ ఎనర్జీని త‌ర్వాత ఎవ‌రు డైర‌క్ట్ చేస్తారో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే కొద్ది రోజులుగా రామ్ , అనిల్ రావిపూడి కాంబినేష‌న్ పై గ‌త కొన్ని రోజులుగా వ‌స్తున్న వార్త‌ల‌పై రామ్ స్పందించాడు.
ఇదిలా ఉండ‌గా.. గ‌తంలో 'నా 15వ సినిమాని అనిల్ రావిపూడితో చేస్తున్నానని అనౌన్స్ చేయడానికి సంతోషిస్తున్నా. ఇది చాలా స్పెషల్. బ్లైండ్ అయినా కమర్షియల్.' అంటూ ట్వీట్ చేశాడు రామ్. మొత్తానికి రామ్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్లే ఉంది. ఇప్పటివరకూ హీరో గుడ్డివాడి రోల్ వేస్తే.. అవన్నీ సెంటిమెంట్ బేస్డ్ గానే వచ్చాయి. ఓ కమర్షియల్ హీరో కమర్షియల్ సినిమా చేస్తూ బ్లైండ్ రోల్ చేయడం.. ఇదే మొదటిసారి అనుకున్న అంద‌రికీ రామ్ షాక్ ఇచ్చాడు.
అయితే ఇప్పుడు త‌న ప్లానింగ్ లో కొంచెం మార్పు వ‌చ్చింద‌ని, ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు త‌న 15వ సినిమా బ్లైండ్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ కాద‌ని, త‌దుప‌రి సినిమా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తానంటూ ట్వీట్ చేశాడు. ప్లానింగ్ లో తేడా వ‌చ్చింది స‌రే. 15వ సినిమా అనిల్ తో కాద‌ని చెప్పాడు స‌రే. అస‌లు అనిల్ తో సినిమా ఉంటుందో లేదా అన్న విష‌యం కూడా చెప్తే బాగుండేది.