Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

ఉగాది రోజున మొద‌లెట్టేస్తున్న ఎనర్జిటిక్ హీరో


 ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైత‌న్య స‌మ‌ర్ప‌ణ‌లో  స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమాస్  బ్యాన‌ర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మిస్తున్నారు.  గ‌తేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన నేను శైల‌జ ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. నేను శైల‌జ చిత్రంలో హీరో రామ్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేసిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌, బాడీలాంగ్వేజ్‌తో చూపించ‌బోతున్నారు. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా మార్చి 29న లాంచ‌నంగా ప్రారంభం కానుంది.

 నేను శైల‌జ చిత్రాన్ని అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా  సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఆర్ట్ ఎ.ఎస్‌.ప్ర‌కాష్ అందిస్తున్నారు. ఈ కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్  ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుంద‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.