వరుస హిట్లతో తన మార్కెట్ ను పెంచుకుంటున్న నిఖిల్


వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ తో దూసుకెళుతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్. స్వామి రారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ హీరో చేసిన కేశవ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, ఆడియన్స్ కి ఎంతో ఆసక్తిని కలిగించింది. 30 రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, విడుదలైన ప్రతిచోటా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తన నటన, నూతన కథల ఎంపికతో మార్కెట్ ని విస్తరించుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.

కేవలం 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన కేశవ 14 కోట్ల వరకూ రాబట్టడం విశేషం. నైజామ్, ఆంధ్ర, సీడెడ్, ఓవర్సీస్ వసూళ్లు మరియు శాటిలైట్ రైట్స్ కలుపుకుని మొత్తంగా 14 కోట్లను వసూలు చేసినట్టు చెబుతున్నారు. నోట్ల రద్దు సమయంలో 'ఎక్కడికిపోతావు చిన్నవాడా'తో హిట్ కొట్టిన నిఖిల్, 'బాహుబలి 2' హవా కొనసాగుతూ ఉండగా వచ్చి మరో హిట్ ను దక్కించుకోవడం విశేషం. అయితే నిఖిల్ కేవలం తన మార్కెట్ ని తెలుగుకి పరిమితం కాకుండా వేరే భాషలలోను విస్తరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుక్కునూర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించి అన్ని చర్చలు పూర్తి కాగా, త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన చేయనున్నట్టు సమాచారం.