నాని చేతుల మీదుగా విడుదల అవ్వబోతున్న 'అమీ తుమీ' టీజర్


“జెంటిల్ మెన్”తో సూపర్ హిట్ అందుకొన్న తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి మరో డిఫరెంట్ జోనర్ లో సరికొత్త చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నద్ధమయ్యారు. “ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్” పతాకంపై కె.సి.నరసింహారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా " అమీ తుమీ" అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఏప్రిల్ 17 సాయత్రం 6.30 గం.లకు  హీరో నాని చేతుల మీదుగా సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయబోతున్నారు. 

ఈ చిత్రానికి కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవిందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రాఫర్: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహా రావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.