తమిళ ‘100% లవ్‌’ హీరోయిన్ గా హెబ్బా పటేల్ !


తెలుగులో సూపర్ హిట్ సాధించిన ‘100% లవ్‌’ తమిళ రీమేక్‌లో హీరోయిన్ గా హెబ్బా పటేల్ నటించబోతున్నట్లు సమాచారం. ‘అలా ఎలా’ చిత్రంతో తెలుగులోకి పరిచయమై, ‘కుమారి 21ఎఫ్‌’తో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు హెబ్బా. ఇప్పుడీ కుమారి తెలుగులో హిట్‌ అయిన ‘100% లవ్‌’ తమిళ రీమేక్‌లో నటించబోతున్నారు. ముందు తెలుగులో చేసిన తమన్నానే తీసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత సడన్‌గా లావణ్యా త్రిపాఠి తెరపైకొచ్చారు. అయితే ఫైనల్‌గా హాట్‌ గాళ్‌ హెబ్బా పటేల్‌కు ఆ ఛాన్స్‌ దక్కిందట. హెబ్బా అధికారికంగా సైన్‌ చేయడమే ఆలస్యం.

తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ హీరోగా చంద్రమౌళి దర్శకత్వంలో తెలుగు ‘100% లవ్‌’కి దర్శకత్వం వహించిన సుకుమార్‌ ఈ రీమేక్‌ను నిర్మించనుండటం విశేషం. మూడేళ్ల క్రితమే హెబ్బా తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు. 2014లో వచ్చిన ‘తిరుమణమ్‌ ఎన్నుమ్‌ నిక్కా’లో చిన్న రోల్‌ చేశారు.