Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Guppendantha Prema Director Interview


Eye wink productions producing a beautiful love story under the direction of Vinod lingala named 'Guppedantha prema' which completed its censor formalities and getting g ready for its release on silver screen. The Audio and trailer which released recently got a good response and appreciated by all sector of audience.Sai ronak, Aditi Singh,Aishwarya.k, Noel neni, Naveen Neni are playing lead roles. On the occasion of movie release on 17th this month the director of this film Vinod lingala spoke with media.
 
About movie? In these days Meeting in the morning, proposing in after noon, and breakup in one week but there are also love stories like this in these days also which are ever green and this movie 'Guppedantha prema' is coming with a different story.Everyone has 1st love in their life. The love is very beautiful as well as very painful after breakup. But when we remember about 1st love we have a smile on our face.Those memories were picturised poetically and where being bought to screen. This movie runs under the backdrop of university.
Trailer and audio got a good response? Yes, we got huge response for the audio and trailer which released by Madhuri audio.Sakhiya Sakhiya song in this movie is now at 4th place in top 5 songs in Saavan. This movie album ranked at top 5 in noted news paper which is good example for the response.
Looks like locations in trailers are very attractive. Where did you went for picturising it? Total credit goes to Cinematographer Sanjay loknath. He picturised every minure article very Beautiful. We went all over India for the locations.Shillong, chirapunji,Mavlainong, Meghalaya and all the parts of East and West Indian locations we shoot this film which will be eye feast for sure.
Why did you select new Hero heroines for this film? I believed that this story needs new talent. This story will connect audience if they are fresh faces on screen.
Did you have any experience in Industry already? Yes I worked for Its my love story and Seethamma vakitlo Sirimalle chettu movies.But 'Guppedantha prema'is first film for me as a director. I hope this movie will liked by everyone.
You worked with Madhura sreedhar for it's my love story.how is the experience? To be frank he is a well wisher for me.He supported me very much.His help rememberable for me for this movie from starting.In one work the reason for releasing this film is only him.
ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్ లో డైర‌క్ట‌ర్ వినోద్ లింగాల తెర‌కెక్కించిన ఒక అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం గుప్పెడంత ప్రేమ.ఈ చిత్రం సెన్సార్  అయి, వెండితెర మీద‌కు రావ‌డానికి సిద్దమైంది. ఇటీవ‌ల మార్కెట్ లోకి విడుద‌లైన ఆడియో మరియు ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న రావ‌డంతో గుప్పెడంత ప్రేమ యూనిట్ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. సాయి రోన‌క్, అదితి సింగ్, ఐశ్వ‌ర్య.కె, నోయ‌ల్ నేని, న‌వీన్ నేని ప్రధాన తార‌గ‌ణంగా న‌టించారు. ఈ నెల 17న విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.
 
సినిమా గురించి..?
ఉద‌యం క‌లుసుకుని, సాయంత్రానికి ఐల‌వ్యూ చెప్పుకుని, వారంలోపే బ్రేక‌ప్ చెప్పుకునే ఈరోజుల్లో ఇలాంటి ప్రేమక‌థ‌లు కూడా ఉంటాయి అంటూ ప్రేమ‌లోని ఒక కొత్త కోణాన్ని అంద‌రికీ తెలియ‌చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ గుప్పెడంత ప్రేమ‌. ప్ర‌తి ఒక్క‌రికీ జీవితంలో తొలి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎంత బాగా ఉంటుందో, కొన్ని సార్లు బ్రేక‌ప్ అయిన‌ప్పుడు కూడా ఆ గాయం అంతే గ‌ట్టిగా ఉంటుంది. కాక‌పోతే ఆ గాయం గుర్తుకొచ్చిన ప్ర‌తిసారీ పెదాల‌పై చిరున‌వ్వు విరుస్తుంది. తొలి ప్రేమ గురించిన ఆ విష‌యాల‌ను అంతే అందంగా తెర‌పై క‌వితాత్మ‌కంగా చెప్పాం. యూనివ‌ర్శిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కొన‌సాగుతుంది.
ఆడియోకు, ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చిన‌ట్లుందీ..?
అవును. మ‌ధురా ఆడియో ద్వారా వ‌చ్చిన ఈ ఆల్బ‌మ్ కు ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. సినిమాలోని స‌ఖియా.. స‌ఖియా అనే పాట సావ‌న్ అనే మ్యూజిక్ ఆప్ లో టాప్ ఫైవ్ సాంగ్స్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉండ‌టంతో పాటు, ఒక ప్ర‌ముఖ వార్తాప‌త్రిక ప్ర‌చురించిన టాప్ 5 ఇండియ‌న్ ఆల్బ‌మ్స్ లో ఒక‌టిగా ఈ సినిమా ఆడియో నిల‌వ‌డ‌మే దానికి నిద‌ర్శ‌నం.
ట్రైల‌ర్, సాంగ్స్ లో లొకేష‌న్స్ చాలా అట్రాక్ష‌న్ గా ఉన్నాయి. చాలా ప్లేసెస్ కి ట్రావెల్ చేసిన‌ట్లున్నారు..?
అదంతా సినిమాటోగ్ర‌ఫ‌ర్ సంజ‌య్ లోక్‌నాథ్ కెమెరా పనితీరే. ప్ర‌తి చిన్న ఆబ్జెక్ట్ ని ఎంతో అందంగా చూపించారు. లొకేష‌న్ల కోసం దాదాపు ఇండియాలోని మేజ‌ర్ ప్రాంతాల‌న్నింటికీ వెళ్లాం. షిల్లాంగ్, చిర‌పుంజి, మ‌వ్లైనాంగ్, మేఘాల‌య లోని వివిధ ప్రాంతాల్లో మ‌రియు ఉత్త‌ర‌, తూర్పు భార‌త‌దేశంలో గ‌ల అనేక లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించిన ఈ చిత్రం అంద‌రికీ ఖ‌చ్చితంగా క‌న్నుల పండుగ‌గా ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది.
ఈసినిమాకు కొత్త హీరోహీరోయిన్ల‌నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?
ఈక‌థ‌కు కొత్త వాళ్లే సెట్ అవుతార‌నిపించింది. ఫ్రెష్ ఫేసెస్ తో ఉంటేనే ఈ క‌థ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది అనిపించి అలా సెలెక్ట్ చేశాం.
ఆల్రెడీ ఇంత‌కుముందే సినీ ప‌రిచ‌యం ఉన్న‌ట్లుందీ..?
అవును.. ఇదివ‌ర‌కే ఇట్స్ మై ల‌వ్ స్టోరీ, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాల‌కు ప‌నిచేశాను. కానీ ద‌ర్శ‌కుడిగా నాకు గుప్పెడంత ప్రేమ తొలి చిత్రం. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను.
 
ఇట్స్ మై ల‌వ్ స్టోరీ సినిమాకు మ‌ధుర శ్రీధ‌ర్ గారితో క‌లిసి ప‌నిచేశారు.. ఆ ఎక్స్‌పీరియెన్స్ ఎలా అనిపించింది..? 
నిజం చెప్పాలంటే ఆయ‌న నాకు వెల్ విష‌ర్. ఇట్స్ మై ల‌వ్ స్టోరీ సినిమాలోనే న‌న్నెంతో స‌పోర్ట్ చేశారు. ఇక ఈసినిమా మొద‌లు నుండి ఇప్ప‌టి వ‌ర‌కు, రిలీజ్ విష‌యంలో కూడా ఆయ‌న చేసిన స‌హాయం మ‌రువ‌లేనిది. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే ఈ సినిమా విడుద‌లకు సిద్ధ‌మైందంటే ఆయ‌న వ‌ల్లే.
 
ర‌చ‌న‌,ద‌ర్శ‌క‌త్వంః వినోద్ లింగాల, ప్రొడ్యూస‌ర్ః ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్, మ్యూజిక్ డైర‌క్ట‌ర్ః న‌వ్‌నీత్ సుంద‌ర్, సినిమాటోగ్ర‌ఫీః సంజ‌య్ లోక్‌నాథ్, ఎడిట‌ర్ః బ‌స‌వ‌,ఆర్ట్ః రాజీవ్ నయ్య‌ర్, లైన్ ప్రొడ్యూస‌ర్ః పి టి గిరిధ‌ర్ రావు, ప్రొడ‌క్ష‌న్&ప‌బ్లిసిటీ డిజైన‌ర్ః విజ‌య్ మోప‌ర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పావ‌ని  లింగాల‌, లిరిక్స్ః వ‌న‌మాలి, శ్రీమ‌ణి, గ‌ణేష్ సలాడి, తిల్లు ప‌సునూరి