Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

ఆడియో విడుదల సన్నాహాల్లో "కేడి బిల్లా-కిలాడి రంగా


"పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్  చిత్రాల ఫేం పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొంది.. ఘన విజయం సాధించిన తమిళ చిత్రం "కేడి బిల్లా-కిలాడి రంగా" అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. రాజ్‌ కందుకూరి సమర్పణలో.. భీమవరం టాకీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రెజీనా ఈ చిత్రంలో  మెయిన్‌ హీరోయిన్‌ కాగా.. కోలీవుడ్‌లో లీడింగ్‌ హీరోయిన్‌గా పేరు గడించిన మన తెలుగమ్మాయి బిందుమాధవి మరో హీరోయిన్‌. విమల్‌-శివకార్తికేయన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్‌ శంకర్‌రాజా స్వర సారధ్యం వహించారు. అన్ని  కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం  పాటలు ఈ వారంలో విడుదల చేసి, మే 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాత  తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "రాజ్‌ కందుకూరి సమర్పణలో "కేడి బిల్లా-కిలాడి రంగా" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రెజీనా, బిందుమాధవిల గ్లామర్‌- విమల్‌, శివకార్తికేయన్‌ల పెర్‌ఫార్మెన్స్- యువన్‌ శంకర్‌రాజా సంగీతం "కేడి బిల్లా-కిలాడి రంగా" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. "పసంగ, మేము, కథకళి" వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు పాండిరాజ్ "కేడి బిల్లా-కిలాడీ రంగా" చిత్రాన్నిహిలేరియస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు. ఈ వారంలో ఆడియో రిలీజ్‌ చేసి, మే 13న సినిమాను విడుదల చేయనున్నాం" అన్నారు. 
ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్‌, ఆడియోగ్రఫి: శేషు కె.యం.ఆర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్: డా.శివ. వై. ప్రసాద్-బి.సత్యనారాయణ, మ్యూజిక్‌: యువన్‌ శంకర్‌రాజా, సమర్పణ: రాజ్‌ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!