Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Gopichand Movie Oxygen in Last Schedule


        Aggressive hero Gopichand  is acting under the direction of A.M.Jyothi krishna from the banner of Sai ram creations produced by S.Aishwarya which is titles as 'Oxygen'. This movie is shooting it's final schedule on this event total unit wished Gopichand a very happy birthday. Gopichand, Rashi khanna, Jagapati babu, Anu Immanuel, kick shyam, Ali, Brahmaji, Sitara, Abhimanyu Singh, Shiyaji Shinde, Chandramohan, Sudha, Prabhakar, Amit etc are playing main roles in this film.                                   
చివరి షెడ్యూల్ చిత్రీకరణలో గోపీచంద్  ఆక్సిజన్
ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌'. ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. జూన్ 12న హీరో గోపీచంద్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హీరో గోపీచంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా.....
దర్శకుడు ఎ.ఎం.జ్యోతికృష్ణ మాట్లాడుతూ ‘’మా యాక్షన్ హీరో గోపీచంద్ కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన హీరోగా మా బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఆక్సిజన్ చిత్రం ఇప్పుడు చివరి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు డిఫరెంట్ సబ్జెక్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది. త్వరలోనే ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరపుకుంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.
                                                                                        గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌,  ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌:పీటర్ హెయిన్, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.