Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

జెంటిల్ మెన్ మూవీ ట్రైలర్ రివ్యూ


తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అష్టాచెమ్మా చిత్రంతో హీరోగా అదిరిపోయే ప‌ర్ఫామెన్స్ తో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని.. త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు యావ‌రేజ్ గా నిలిచినా, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈగ చిత్రంతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. గ‌తేడాది వ‌చ్చిన భలే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న నాని, ఈ సంవ‌త్స‌రం వ‌చ్చిన కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాధ చిత్రం కూడా అద్భుత విజ‌యం సాధించ‌డంతో నాని.. చిన్న నిర్మాత‌ల పాలిట మినిమం గ్యారెంటీ హీరోగా నిలిచిపోయాడు.

త‌న‌కు లైఫ్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితోనే మ‌ళ్లీ జ‌త క‌ట్టాడు నేచుర‌ల్ స్టార్ నాని.వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న మూవీ జెంటిల్ మెన్ .కాంబినేష‌న్ తోనే ఆస‌క్తి క‌లిగించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ నుంచే అందరిలోనూ అంచ‌నాలు పెంచింది. రీసెంట్ గా జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్ లో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

‘వయొలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడొస్తాయో కదా’ అంటూ నాని డైలాగ్ తో ఫైటింగ్ ఎపిసోడ్ ని మొదలుపెట్టి.. అక్కడినుంచి అంతా క్రైమ్ కహానీ రేంజ్ లో చూపించారు. రెండు షేడ్స్ ఉన్న రోల్ ని నాని అద్భుతంగా పండించాడు. హీరోయిన్ ని కాపాడుతున్నాడో.. లేక తనే చంపేందుకు ట్రై చేస్తున్నాడో అనే క్యూరియాసిటీని కలిగించడంలో మాత్రం డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యాడు. తక్కువ ఫ్రేమ్స్ లోనే కనిపించిన శ్రీనివాస్ అవసరాల.. మాట్లాడిన తక్కువ డైలాగ్స్ తోనే ఆకట్టుకున్నాడు. మొత్తం మీద జెంటిల్మన్ ట్రైలర్ ఆడియన్స్ లో ఆసక్తిని బాగానే జనరేట్ చేసింది. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే మాత్రం జూన్ 17న రిలీజ్ వరకూ ఆగాల్సిదే.

మామూలు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ల‌తో పోలిస్తే ఈ ట్రైల‌ర్ ను కొంచెం చిన్న‌గానే క‌ట్ చేశారు. ఎక్కువ నిడివి లేకుండా కాన్సెప్ట్ ని చెప్పీ చెప్ప‌న‌ట్లుగా రివీల్ చేశారు. ట్రైల‌ర్ ఫస్ట్ లో ల‌వ్ స్టోరీతో మొద‌లుపెట్టి త‌ర్వాత వ‌య‌లెన్స్ వ‌కైపు ట‌ర్న్ తీసుకున్న విధానం చూస్తే ఎవ‌రైనా సూప‌ర్ అనాల్సిందే. స్టార్టింగ్ లో హీరోయిన్ ని రెండు చేతుల‌తో ప‌ట్టుకుని ‘అలా సడెన్ గా అడిగితే ఏం చెప్తాం’ అంటూ నాని అడిగిన తీరు చూస్తే.. నాని త‌ప్ప వేరే ఎవ‌రూ ఆ డైలాగ్ చెప్ప‌లేర‌ని అనిపిస్తుంది. దీని త‌ర్వాత వ‌చ్చే సీన్ లో ర‌జ‌నీ స్టైల్ ని పార‌డీ చేయ‌డం కూడా అదుర్స్.