Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

అత‌ని తిక్క‌, జోష్ బాగా న‌చ్చాయి..


రొమాంటిక్ లవ్ స్టోరీలు, క్రైమ్ థ్రిల్ల‌ర్స్ ను తెర‌కెక్కించ‌డంలో పేరు పొందిన డైర‌క్ట‌ర్స్ లో గౌత‌మ్ మీన‌న్ ఒకరు. గౌతమ్ మీన‌న్ సినిమా వ‌స్తుందంటే చాలు హీరో ఎవ‌రు, హీరోయిన్ ఎవ‌రు అన్న దానితో సంబంధం లేకుండా ఎంతో ఆస‌క్తితో ఎదురుచూసే వాళ్లు సైతం ఉన్నారు. అటు త‌మిళ‌, ఇటు తెలుగుభాష‌ల్లో త‌న‌దైన శైలిలో ముద్ర వేసుకున్న గౌత‌మ్ మీన‌న్ తాజాగా సాహ‌సం శ్వాస‌గా సాగిపో అంటూ ప‌లక‌రించారు. నాగ‌చైత‌న్య తో ఆయ‌న తీసిన ఈ రెండో సినిమా ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆకట్టుకుంది. చైతూ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వాలే కానీ, త‌న‌తో ఇంకో సినిమా చేయాల‌ని ఉంద‌ని త‌న అభిప్రాయాన్ని మీన‌న్ బ‌య‌ట పెట్టారు. త‌న‌కు క‌లిసొస్తున్న హీరో, ప్ర‌స్తుతం హిట్ లో ఉన్నాడు కాబ‌ట్టి చైతూ గురించి మాట్లాడాడు అనుకోవ‌చ్చు. కానీ గౌత‌మ్ మీన‌న్ ఇంకో టాలీవుడ్ హీరోతో కూడా త‌న‌కు సినిమా చేయాల‌నుంద‌ని చెప్పాడు. మంచి జోష్ లో ఉన్న తేజూ ని డైర‌క్ట్ చేయాల‌నుంద‌ని త‌న అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్ కోసమ‌ని గౌత‌మ్ మీన‌న్ ఒక క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం విన్న‌ర్ సినిమాలో బిజీగా ఉన్న సాయి కి గౌత‌మ్ తీసుకొచ్చిన క‌థ న‌చ్చుతుందో లేదో మ‌రి.