Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

మెట్రో ట్రైల‌ర్ ను విడుద‌ల చేసిన గౌత‌మ్ మీన‌న్


రొమాంటిక్ ల‌వ్ స్టోరీలు.. క్రైమ్ థ్రిల్ల‌ర్లు తెర‌కెక్కించ‌డంలో గౌత‌మ్‌మీన‌న్‌ని కొట్టేవాళ్లే లేరు! గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వ‌స్తోంది అంటే హీరో ఎవ‌రు? అన్న‌దాంతో సంబంధం లేకుండా ఎంతో ఎగ్జ‌యిటింగ్‌గా ఎదురు చూసే ఫ్యాన్స్ ఉంటారు. ఆయ‌న మార్క్‌ క్లాస్ ట‌చ్‌.. పోయెటిక్ ఎప్రోచ్‌తో మన‌సు దోచే స్టైలిష్ ఎంట‌ర్‌టైన‌ర్లు చూడాల‌న్న క్యూరియాసిటీ జ‌నాల్లో ఉంటుంది. అటు త‌మిళ్‌, ఇటు తెలుగు రెండు చోట్లా ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేకించి అభిమానులున్నారు. చెలి, ఘ‌ర్ష‌ణ‌, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌, రాఘ‌వ‌న్‌, ఏమాయ చేశావే, ఎంత‌వాడు గానీ, ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు, .. లేటెస్టుగా `సాహ‌సం శ్వాస‌గా సాగిపో` .. ఇవ‌న్నీ క్లాసిక్ హిట్స్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచాయి. 
 
అంత‌టి స్టార్ డైరెక్ట‌ర్ మెచ్చిన త‌మిళ చిత్రం `మెట్రో` ఇప్పుడు తెలుగులోనూ అనువాద‌మై రిలీజ‌వుతోంది. `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `షాపింగ్‌మాల్‌`, `పిజ్జా` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను తెలుగువారికి అందించిన సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌-4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌జ‌ని తాళ్లూరి ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. హైద‌రాబాద్‌లో `మోట్రో` తెలుగు ట్రైల‌ర్‌ని లాంచ్ చేశారు గౌత‌మ్ మీన‌న్‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ -``మెట్రో ఫెంటాస్టిక్ మూవీ. త‌మిళంలో రిలీజైన ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులో అంత‌కుమించిన విజ‌యం సాధిస్తుంది. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన న్యూ ఏజ్ సినిమా. న‌వ‌త‌రానికి బాగా న‌చ్చుతుంది. ఈ సినిమాకి ప‌నిచేసిన టీమ్‌కి మంచి పేరొచ్చింది. తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి- ర‌జ‌నీ తాళ్లూరికి నా బెస్ట్ విషెస్`` అన్నారు. 
 
నిర్మాత ర‌జ‌నీ తాళ్లూరి మాట్లాడుతూ -``డ‌బ్బింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్‌కి వ‌స్తోంది. గౌత‌మ్ మీన‌న్ అంత‌టి స్టార్ డైరెక్ట‌ర్ మా సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేసి, సినిమా తెలుగువారికి న‌చ్చుతుంద‌ని ప్ర‌శంసించ‌డం సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది`` అన్నారు. 
 
స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -``ఏ నిర్మాత అయినా.. ఆయ‌న కాల్షీట్లు ఇస్తే త‌న‌తో సినిమా తీయాల‌నుకుంటారు. అంత గొప్ప స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్‌. ఆయ‌న మెట్రో ట్రైల‌ర్‌ని లాంచ్ చేయ‌డం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా నాకెంతో న‌చ్చిన సినిమా అని గౌత‌మ్ మీన‌న్ చెప్పారంటే  విజ‌యంపై మా న‌మ్మ‌కం మ‌రింత రెట్టింపైంది. గౌత‌మ్ గారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు. నేను నిర్మించిన `జ‌ర్నీ` సినిమాని మించి `మెట్రో` విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. అంద‌రూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా`` అన్నారు.