Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

సెన్సారు పూర్తిచేసుకుని ఏప్రిల్ 14న విడుద‌ల కానున్న‌'గ‌జేంద్రుడు'


మూడు ద‌శాబ్దాలుగా ఎన్నో కుటుంబ క‌థాచిత్రాలతో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మాత‌గా ప్రోడ‌క్ష‌న్ 89 గా రూపొందిన చిత్రం `గ‌జేంద్రుడు`. ఆర్య‌, క్యాథ‌రిన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం సెన్సారు కార్యక్ర‌మాలు పూర్తిచేసుకుంది, చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుద‌ల‌చేస్తున్నారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో కి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 

నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి గారు మాట్లాడుతూ..మా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్లో వ‌స్తున్నప్రోడ‌క్ష‌న్‌నెం 89వ సినిమా `గ‌జేంద్రుడు`. ఈ చిత్రం ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. క్యాథ‌రిన్ ఎంతో చ‌క్క‌గా న‌టించింది. హీరో హీరోయిన్స్ ఇద్ద‌రూ పాత్ర‌కు త‌గ్గట్టుగా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా వీరి బాడీ లాంగ్వేజ్ ని మార్చుకున్నారు. పిల్ల‌ల్ని బాగా అల‌రించే చిత్రంగా గ‌జేంద్రుడు ఈ స‌మ్మ‌ర్ కి ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఫ్యామిలి అంతా వ‌చ్చి చూసి ఎంజాయ్ చేసే చిత్రంగా మా గ‌జేంద్రుడు వుంటుంది. యువ‌న్‌శంక‌ర్ రాజా మంచి సంగీతాన్ని అందించారు.  డైరెక్ట‌ర్ రాఘ‌వ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు. సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 14న విడుద‌ల‌వుతుంది. నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి తెలిపారు.  

హీరో ఆర్య మాట్లాడుతూ.. నేను ఎప్పుడు కొత్త చిత్రం చేసినా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. మ‌రో కొత్త చిత్రం ఈ గ‌జేంద్రుడు. కంటెన్ట్‌బేస్‌డ్ సినిమాల‌ను చేసే నిర్మాత‌ల్లో ఆర్‌.బి.చౌద‌రిగారు నిర్మించారు.  ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సుల‌భం కాదు. చౌద‌రిగారి స‌పోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథ‌రిన్ ఎంతో స‌పోర్ట్ చేసింది.  డైరెక్ట‌ర్ రాఘ‌వ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. త‌న మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడు త‌ను భ‌విష్య‌త్‌లో తెలుగు, త‌మిళంలో పెద్ద ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు. ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అని హీరో ఆర్య అన్నారు.