కొల‌త‌లు ఇవ్వ‌డానికి రెడీ అంటున్న భామ‌లు


గ‌త కొన్నాళ్లుగా స‌రైన హిట్లు లేని సీనియ‌ర్ డైర‌క్ట‌ర్ వంశీ, త‌న సూప‌ర్ హిట్ సినిమా అయిన లేడీస్ టైల‌ర్ కు సీక్వెల్ గా ప్యాష‌న్ డిజైన‌ర్ S/o లేడీస్ టైల‌ర్ అంటూ సుమంత్ అశ్విన్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విడుదలైన ప్రీ లుక్ పోస్ట‌ర్‌తోనే సినిమాకు ఎంతో హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఇప్పుడు రిలీజ్ అయింది. ఒక‌మ్మాయి చెస్ట్ దగ్గ‌ర కొల‌తలు తీసుకుంటున్న హీరోది ప్రీ లుక్ గా రిలీజ్ చేయ‌డంతో ఆ పోస్ట‌ర్ సంచల‌నాలు క్రియేట్ చేసింది. ఒక చిన్న సినిమా గురించి జ‌నాలు స‌డెన్ గా మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో, వంశీ కూడా అదే చేశాడు. 

అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో సుమంత్ అశ్విన్, హీరోయిన్ మ‌నాలి రాథోడ్ న‌డుము కొల‌త‌లు తీసుకుంటుండ‌గా, ఆమె వెనుక మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ మాన‌స‌, అనీషా అంబ్రోస్ లిద్ద‌రూ కొల‌త‌లు ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నారు. చూడటానికి మాత్రం పోస్ట‌ర్ బాగుంది. ఎప్పుడూ హీరోయిన్స్ ను ప‌ద్ద‌తిగా చూపించే వంశీ, ఈసారి త‌న స్టైల్ ను హీరోయిన్స్ ను కాస్త కొత్త‌గా ప్రెజెంట్ చేస్తున్నాడు. మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై  మ‌ధుర‌ శ్రీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు స్వ‌రాల బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌నున్నాడు. మ‌రి ప్రీ లుక్, ఫ‌స్ట్ లుక్ తోనే మాంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న వంశీ.. ఈ సినిమాతో అయినా విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.