DSP, Ratnavelu Not Working For Sukumar Movie


If a movie is coming from Creative director Sukumar we should not think of music director because everyone thinks that DSP is fixed. Same for Cinematography also for Ratnavelu. Now Sukumar is planning a movie without these both. Last year sukumar turned as producer with the movie Kumari 21F,for that film they both worked for free. They took remuneration after the movie success but it is great working without expecting money. But Sukumar kept this both aside for his next production.
Sukumar is producing a movie with Sharwanand as hero who selected music director as Sai karthik and cinematographer as Praveen. But DSP is giving music for his next directional. Charan as hero Sukumar is planned for a scientific thriller. But Ratnavelu is in pending.
ఫ్రెండ్స్ ని వ‌ద్ద‌నుకున్న సుకుమార్
క్రియేటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్ సినిమా వ‌స్తుంది అంటే దానికి మ్యూజిక్ డైరక్ట‌ర్ ఎవ‌రు అని చెప్పాల్సిన ప‌నిలేకుండానే దేవీశ్రీ ని ఫిక్స్ అయిపోతారు అంద‌రూ. అలాగే సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు కూడా సుక్కు తీసిన మేజ‌ర్ సినిమాల‌న్నింటికీ త‌నే సినిమాటోగ్ర‌ఫ‌ర్.అలాంటిది సుక్కు వీరిద్ద‌రూ లేకుండా ఒక సినిమా తీస్తున్నాడ‌ట‌. నిజ‌మేనండి.. న‌మ్మ‌ట్లేదా.. గ‌తేడాది వ‌చ్చిన కుమారి 21ఎఫ్ తో నిర్మాత‌గా మారాల‌ని నిర్ణ‌యించ‌కున్న సుక్కుకు ఈ ఇద్ద‌రు మిత్రులు ఫ్రీగా ప‌నిచేయ‌డానికి ముందుకొచ్చారు. త‌ర్వాత లాభాల్లో వాటా తీసుకున్న‌ప్ప‌టికీ, ముందుగా డ‌బ్బులు లేకుండా ప‌నిచేయ‌డం గొప్ప విష‌య‌మే. కానీ త‌న నిర్మాణంలో రాబోయే నెక్స్ట్ సినిమాకు మాత్రం స‌క్కు వీరిని దూరం పెడుతున్నాడు.
సుక్కు నిర్మాణంలో శ‌ర్వానంద్ హీరోగా రూపొంద‌నున్న సినిమాకు మ్యూజిక్ డైర‌క్ట‌ర్ గా సాయికార్తీక్, సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ప్ర‌వీణ ఎంపిక‌య్యారు. ప్ర‌తిసారీ లాభాల్లో వాటా ప‌ద్ద‌తి వ‌ర్క‌వుట్ అవ‌ద‌ని సుక్కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. కానీ త‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే సినిమాకు మాత్రం సుక్కు మ‌ళ్లీ దేవీశ్రీ ఛాన్స్ ఇచ్చాడు. చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఈ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ కు దేవీ క‌న్ఫార్మ్ అవ‌గా, ర‌త్న‌వేలు సంగ‌తి మాత్రం ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది.