Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

ఖైదీనంబ‌ర్ 150` రోల్ న‌టుడిగా నా ఇమేజ్ పెంచింది


``ఖైదీనంబ‌ర్ 150` సినిమాలో ఐఏఎస్ రోల్ త‌న‌కి గొప్ప గుర్తింపు తెచ్చింద‌ని అంటున్నారు యాక్ట‌ర్ కం డాక్ట‌ర్ కిషోర్‌. కోయ ఐఏఎస్ క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌గా న‌టించావ‌ని ఐఏఎస్‌, ఐపీఎస్‌లే త‌న‌కి కాల్ చేసి అభినందించార‌ని చెబుతున్నారు. ఖైదీనంబ‌ర్ 150 సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డం, త‌న పాత్ర‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్క‌డం చాలా సంతోషాన్నిచ్చింద‌ని అన్నారు.

ko1డా.కిషోర్ కోయ మాట్లాడుతూ -``వి.వి.వినాయ‌క్ గారు చాలా స‌న్నిహితులు. ఒక‌రోజు స‌ర్‌ప్రైజింగ్‌గా `నాయ‌క్‌`లో మంచి క్యారెక్ట‌ర్ ఉంది చేయండి అని ఛాన్సిచ్చారు. నాయ‌క్‌లో కోల్‌క‌త పోలీసాఫీస‌ర్‌గా న‌టించాను. అది చేసిన త‌ర్వాత స్నేహితులు, ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. చాలా థ్రిల్ క‌లిగించింది. స్క్రీన్ ప్ర‌జెన్స్ చూసుకున్న‌ప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా మంది ఫ్రెండ్స్‌ ఫోన్ చేసి అభినందించారు. ఆ త‌ర్వాత `ఎవ‌డు`లో రామ్‌చ‌ర‌ణ్ - బ‌న్ని కాంబినేష‌న్‌లో డాక్ట‌ర్ క్యారెక్ట‌ర్ చేశాను. వినాయక్ గారి `అల్లుడు శీను` చిత్రంలోనూ అబూద‌బీ-ఇమ్మిగ్రేష‌న్ ఆఫీస‌ర్‌గా న‌టించాను. `వీకెండ్ ల‌వ్‌` చిత్రంలో నెగెటివ్ రోల్ చేశాను.

ఇప్పుడు `ఖైదీనంబ‌ర్ 150`లో బ్రేక్ ఇచ్చే రోల్ చేశాను. 500 పైగా కాల్స్ వ‌చ్చాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఫోన్ చేసి క‌లెక్ట‌ర్ పాత్ర‌లో చాలా బాగా న‌టించావ‌ని ప్ర‌శంసించారు. ఇంత చక్క‌ని క్యారెక్ట‌ర్ ఇచ్చి ఎంక‌రేజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు, వినాయ‌క్ గారికి ధ‌న్య‌వాదాలు. ప్ర‌స్తుతం వ‌రుణ్‌తేజ్ - శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్‌లోని `మిస్ట‌ర్‌` సినిమాలో మ‌రో ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్ చేస్తున్నా... అని తెలిపారు.