Latest News

క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా ఆనందో బ్ర‌హ్మ: కొంచెం న‌వ్వులు .... గంపెడు నీర‌సం ఆగ‌స్టు 21న సర్ ప్రైజ్ ఇవ్వనున్న అఖిల్ మంచు ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై ల‌క్ష్మి మంచు ప్ర‌ధాన పాత్ర‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.4 ప్రారంభం పవన్ కళ్యాణ్ పాటను ఆవిష్కరించిన 'మా' అధ్యక్షులు శివాజీరాజా

#mb23 ఫ‌స్ట్‌లుక్కేనా.. టైటిల్ కూడానా..


బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాప్ త‌ర్వాత మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మురుగదాస్ డైర‌క్ష‌న్ లో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. సినిమా మొద‌లు పెట్టి, ఇప్ప‌టికే దాదాపు 10 నెల‌లు కావస్తున్నా, ఇంకా సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయ‌క‌పోవ‌డంపై మ‌హేష్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంకో రెండు నెల‌ల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని, ఇప్ప‌టివ‌ర‌కు సినిమా టైటిల్ చెప్ప‌క‌పోవ‌డం ఏంటి అని వీరావేశంలో ఉన్నారు. 

అయితే, అభిమానుల ఆవేశం త‌గ్గించ‌డానికో, లేక ముందు అనుకున్నతేదీనే ఇప్పుడు స‌డెన్ గా చెప్పారేమో తెలీదు కానీ, మ‌హేష్- మురుగదాస్ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది #MB23 టీమ్. ఏప్రిల్ 12 సాయంత్రం 5 గంట‌ల‌కు ముహుర్తం పెట్టి, డీటైల్స్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది టీమ్. దీంతో ఫ్యాన్స్ కు మ‌హేష్ ను కొత్త సినిమా పోస్ట‌ర్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆతృత ఎక్కువైపోయింది. అయితే ఇప్పుడు అంద‌రిలోనూ క‌లుగుతున్న ప్ర‌శ్న ఒక్క‌టే. సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నామ‌న్నారే కానీ, టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా చేస్తాం అని చెప్ప‌లేదు. సో, టైటిల్ ను మ‌రోసారి రిలీజ్ చేస్తారా లేక ఫ‌స్ట్‌లుక్ తోనే టైటిల్ ను కూడా రివీల్ చేస్తారా అన్న‌ది రేప‌టి వ‌ర‌కు వెయిట్ చేస్తేనే తెలుస్తుంది. 

ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్ ఓ కొత్త గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడ‌ని, ఈ క‌థ జేమ్స్ బాండ్ సినిమా టైప్ లో స్పై థ్రిల్ల‌ర్ గా కొన‌సాగుతుంద‌ని అంటున్నాడు మురుగ‌దాస్. జూన్ 23న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది.