దేవిశ్రీప్ర‌సాద్‌` టీజర్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అభినందనలు - దర్శకుడు శ్రీ కిషోర్


ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్, పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా  స‌శేషం, భూ వంటి చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ `దేవిశ్రీప్ర‌సాద్‌`.ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు.

 ఈ సినిమా టీజ‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే.  టీజ‌ర్‌కు వ‌స్తోన్న స్పంద‌న‌పై ద‌ర్శ‌కుడు శ్రీకిషోర్ మాట్లాడుతూ ..దేవి శ్రీ ప్ర‌సాద్ టైటిల్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసినప్ప‌టి నుండి సినిమాపై అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్‌గా విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్‌ను ఇప్ప‌టికి అన్ని యూ ట్యూబ్ ఛానెల్స్‌లో రెండు మిలియ‌న్స్‌కు పైగా వీక్షించారు. టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణతో పాటు, సినిమా సెన్సార్ అవుతుందో లేదోన‌ని కూడా కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే సినిమాను సెన్సార్ నిబంధ‌న‌ల‌కు లోబడే తెర‌కెక్కించాం. సొసైటీ లో జరిగే చీకటి కోణం ని చూపించడానికి ఎవ్వరు ముందుకు రారు, ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. మన సమాజం లో ఎంతో మంది సైకోలు మన మధ్యలో మనకు తెలియకుండా ఉన్నారు. పుట్టిన పసి కందు నుండి చచ్చిన శవం వరుకు అంతెందుకు జంతువులను కూడా వదలకుండా పైశాచిక ఆనందం పొంతుతున్నారు. చివరికి తల్లి గర్భం లో కూడా ఆడ శిశువుకి ఎలాంటి ర‌క్ష‌ణ లేకుండా పోయింది. మన చుట్టూ సమాజం లో జరిగే నిజమైన సంఘటలను ఆధారంగా తీసుకొని స్త్రీ జాతి ఉనికి తెలియజేయడానికి చేసిన ప్ర‌య‌త్న‌మే మా దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్రం అని తెలిపారు.