ఇక‌పై దిల్ రాజు వాటి జోలికి వెళ్లేది లేదు


2017 సంవ‌త్స‌రాన్ని శ‌త‌మానం భ‌వ‌తి, నేను లోక‌ల్ వంటి మాంచి బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ తో మొద‌లుపెట్టిన దిల్ రాజుకు ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన ఓం న‌మో వేంక‌టేశాయ నిరాశే మిగిల్చింది. త‌ను అనుకున్న రేంజ్ లో సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌లేదు. కాక‌పోతే ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాను దిల్ రాజు డైర‌క్ట్ గా తీసుకోకుండా, కేవ‌లం అడ్వాన్స్ మీదే తీసుకోవ‌డంతో చెప్పుకునేంత న‌ష్ట‌మేమీ దిల్ రాజుకు వాటిల్ల‌లేదు. కానీ ఇప్పుడు దిల్ రాజు బ్యేన‌ర్ అయిన శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నుంచి వ‌చ్చిన మ‌రో కొత్త సినిమా చెలియా మాత్రం ఆయ‌న్ని పెద్ద దెబ్బ కొట్టేలానే ఉంది. 

గ‌తంలో మ‌ణిర‌త్నం చేసిన సినిమా ఓకే బంగారం స‌క్సెస్ కావ‌డం, హీరో కార్తీకి తెలుగులో మంచి డిమాండే ఉండ‌టంతో, ఈసినిమాను రాజు 7.5 కోట్లు పెట్టి మ‌రీ కొన్నాడ‌ట‌. అయితే ఈ సినిమా ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో తోనే నెగిటివ్ టాక్ మూట గ‌ట్టుకోవ‌డంతో, తొలిరోజు రెండూ తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి రూ. 65 ల‌క్ష‌లు మాత్ర‌మే రావ‌డంతో దిల్ రాజుకు లాభాల మాట అటుంచితే, అస‌లుకు అస‌లు రాక‌పోగా భారీ న‌ష్ట‌మే వ‌చ్చేట్లుంది. ఇక‌పోతే గ‌తేడాది వ‌చ్చిన పోలీస్ సినిమా కూడా ఆయ‌న అంచ‌నాల‌ను అందుకోలేదు. మొన్నీమ‌ధ్య వ‌చ్చిన రెమో కూడా అంతే. 

ఇలా ప్ర‌తీ డ‌బ్బింగ్ సినిమా రాజుకు లాభాలు తీసుకురాక‌పోగా,ఇటు ఆయ‌న పేరు, డ‌బ్బు పోగొడుతున్నాయి. దీన్ని బ‌ట్టి చూస్తుంటే, దిల్ రాజు ఇక‌పై డ‌బ్బింగ్ సినిమాల జోలికి వెళ్ల‌డేమో అనిపిస్తుంది.