Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

ధనుష్‌ 'ధర్మయోగి'(ది లీడర్‌) మోషన్‌ పోస్టర్‌ విడుదల


'రఘువరన్‌ బి.టెక్‌' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో ధనుష్‌ మరో సెన్సేషనల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ధనుష్‌ మొదటిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రిష ఈ చిత్రంలో చేస్తున్న క్యారెక్టర్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'నరసింహ' చిత్రంలో రమ్యకృష్ణ పాత్రను పోలి వుంటుంది. విభిన్న కథాంశంతో, పవర్‌ఫుల్‌ క్యారెక్టరైజేషన్స్‌తో తమిళ్‌లో 'కొడి' పేరుతో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి'గా విడుదల చేస్తున్నారు. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ఈరోజు విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో ధనుష్‌ కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం 'కొడి'. తొలిసారి ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. 'రఘువరన్‌ బిటెక్‌' చిత్రంతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ధనుష్‌ నటిస్తున్న ఈ తాజా చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు వున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల చేస్తున్నాం. ఇటీవల తమిళ్‌లో విడుదలైన ఆడియోకు, ట్రైలర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈరోజు 'ధర్మయోగి' మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. అన్నిచోట్ల నుంచి చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'కబాలి' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు చేశారు. ఈ చిత్రం ఆడియోను ఈనెల మూడోవారంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయ్యే ఈ చిత్రం మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.
ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా పాటల రికార్డింగ్‌, డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. '' అన్నారు.
ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: వెంకటేష్‌ ఎస్‌., ఎడిటింగ్‌: ప్రకాష్‌ మబ్బు, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, సమర్పణ: శ్రీమతి జగన్మోహిని, నిర్మాత: సి.హెచ్‌.సతీష్‌కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎస్‌.దురై సెంథిల్‌కుమార్‌.