Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

`దేవిశ్రీప్ర‌సాద్‌` టీజర్‌ను విడుద‌ల చేసిన రాజ్ కందుకూరి


ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్, పూజా రామ‌చంద్ర‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా  స‌శేషం, భూ వంటి చిత్రాల డైరెక్ట‌ర్ శ్రీ కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ `దేవిశ్రీప్ర‌సాద్‌`.ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ధ‌న‌రాజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు.  ఈ సినిమా టీజ‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ..
రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ``మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ న‌టించిన దేవిశ్రీ ప్ర‌సాద్ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. టైటిల్ చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్‌, నిర్మాత‌లు ఆర్‌.వి.రాజు, ఆక్రోష్‌ల‌కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 
చిత్ర నిర్మాత‌లు ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ మాట్లాడుతూ - ``మా దేవిశ్రీప్ర‌సాద్ చిత్రంలో ప్ర‌తి సన్నివేశంతో ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌ధానంగా మ‌నోజ్ నంద‌న్‌, భూపాల్‌, ధ‌న‌రాజ్‌, పూజా రామ‌చంద్ర‌న్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్ల‌ర్‌లో ప్ర‌తి సీన్ ఎంతో ఎంగేజింగ్‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు. 
ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ ఫ‌ణీంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.