Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Dasari The LEGEND


అస‌లేం తెలియ‌ని నిర్మాతల వ‌లనే సినీప‌రిశ్ర‌మ‌లో విజ‌యాలు త‌గ్గిపోతున్నాయంటున్న ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. దర్శకుడిగా ఆయనది ఐదు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం. 150 చిత్రాల చరిత్ర. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, అనేక మంది కొత్త నటీ నటులకు జన్మనిచ్చిన వ్య‌క్తిగా ఆయ‌న చేసిన కృషి ఎన‌లేనిది. తెలుగు సినిమాతో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్నఈ ద‌ర్శ‌క‌ర‌త్నకు బెస్ట్ బ‌ర్త్ డే విషెస్.. తెలుగు సినీ పరిశ్రమలో ఆయ‌నకంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాల్లో 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర అంటే మామూలు విష‌యం కాదు. కవిత్వంలో ఈ శతాబ్దం శ్రీశ్రీది అన్నట్టు… తెలుగు సినిమాల్లో ఈ నాలుగున్నర దశాబ్ధాలు దాసరివే అనడంలో ఎలాంటి సందేహంలేదు. తెలుగు సినిమాను మలుపు తిప్పిన ఘనత ఆయనకే చెల్లింది. అంతవరకూ ఉన్న టాలీవుడ్ పంథా వేరు. దాసరి వచ్చాక తెలుగు సినిమా తీరు వేరు. తెలుగు సినిమాకు ఆయ‌నొక శిఖరం అనొచ్చు. ఎన్నో విష‌యాల్లో ట్రెండ్ సెట్ చేసి తెలుగు సినిమాకు కొత్త‌దారులు వేశారు, ప్రయోగాలు చేశారు. కొత్త నటీనటులతో సినిమాలు తీసి విజయం సాధించినా, సక్సెస్ లు లేని తరుణంలో ప్రముఖ హీరోలకు హిట్లిచ్చినా, సినీ కార్మికులకు అండగా నిలిచినా, వెరైటీ కథలతో సినిమాలు తీసినా, దర్శకుడిదే సినిమా అని నినాదించినా.. అది దాసరి నారాయణరావుకే చెల్లింది. దాసరి పట్టుకోని కథ, తీయని సినిమా, చేయని ప్రయోగం లేదనే చెప్పాలి. అన్ని ర‌కాల చిత్రాలు తీసిన ఆయ‌న కేవ‌లం ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు.. ఎన్నో సినిమాల‌కు క‌థలు, మాట‌లు, పాట‌లు, స్క్రీన్ ప్లే రాయ‌డంతో పాటూ చాలా సినిమాల్లో నటించారు కూడా. 150కి పైగా సినిమాలకు దర్శకత్వం వ‌హించి, గిన్నెస్ బుక్ లో స్థానం సంపాదించారు. అందుకే దర్శకరత్న అయ్యారు. తెలుగులో చిన్న బడ్జెట్ సినిమా అనే ట్రెండ్ దాసరితోనే ప్రారంభమైందని చెప్పాలి. అప్ప‌టిదాకా మన సినిమాలు భారీ బడ్జెట్లతో తయారయ్యేవి. దాసరి వచ్చాక పరిస్థితి, పద్ధతి మారాయి. తక్కువ వ్యయంతో కూడా సినిమా తీయవచ్చని నిరూపించారు ఆయన. తెలుగు సినీ పరిశ్రమకు ఓ మహావృక్షం లాంటి వ్యక్తి దాసరి నారాయణరావు ఇలాంటి బర్త్ డేలు ఎన్నో,మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం