Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

గోదావరి గట్టోళ్ళు..గట్సున్న గొప్పోళ్లు పుస్తకావిష్కరణ


ఉభయ గోదావరి జిల్లాల నుండి వచ్చిన సినీ ప్రముఖుల విశేషాలతో రూపొందిన గోదావరి గట్టోళ్ళు..గట్సున్న గొప్పోళ్లు అనే పుస్తకాన్ని దర్శకరత్న డా.. దాసరి నారాయణరావు ఈ రోజు ఆయన స్వగ్రుహంలో ఆవిష్కరించారు. రాజమండ్రీ లో పోలీస్ డిపార్ట్ మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బి.ఎస్. జగదీష్ రచించింన ఈ పుస్తకాన్ని దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు ఆవిష్కరించి..తొలిప్రతిని ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహరావుకు అందజేసారు. ఈ కార్యక్రమంలో మరో దర్శకనటుడు కాశీ విశ్వనాధ్, దర్శకుడు రాజవన్నెం రెడ్డి, నటుడు సారిక రామచంద్రరావు, రచయిత బిఎస్ జగదీష్ పాల్గోన్నారు.. ఈ సందర్భంగా దర్శక రత్న దాసరి నారాయణ రావు మాట్లాడుతు.. జగదీష్ రావు గుంటూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖుల పై ఇలాంటి పరిశోధనాత్మ రచనలు చెయ్యడం అభినందనీయం.ఉభయ గోదావరి జిల్లాల నుండి ఇంత మంది దిగ్గజాలాంటి సినీ ప్రముఖులు చిత్ర పరిశ్రమలో ఉన్నారన్న నిజం ఈ పుస్తకం చూసాకే తెలిసింది. ఇలాంటి విశేష క్రుషి చేసిన జగదీష్ గారికి ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖుల తరుపున నా క్రుతజ్నతలు..వ్యక్తిగతంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. పుస్తక రచయిత జగదీష్ మాట్లాడుతు “నా ఈ చిరు ప్రయత్నాన్ని అభినందిస్తు పుస్తకాన్ని ఆవిష్కరించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి, తొలి ప్రతిని స్వీకరించిన రేలంగి నరసింహారావు గారికి ఇతర సినీ ప్రముఖులకు నా క్రుతజ్నతలు” అన్నారు.