Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Dandupalyam-2 Completed Its Shooting


From the banner Venkat movies, In the direction of Srinivas Raju Venkat produced a film named Dhandupalyam in Kannada which turned out to be a huge hit and collected 30 crores at the box office. Not only that the movie also released in telugu and collected 10 crores and celebrated 100 days. Now we all know that producer Venkat is doing a sequel for this movie Dhandupalyam 2. Except patch work total movie completed its shoot and getting huge offers. Producer Venkat is planning to release this movie in august by completing all formalities.
సెన్సేషనల్‌ మూవీ 'దండుపాళ్యం-2' షూటింగ్‌ పూర్తి - ఆగస్ట్‌లో రిలీజ్‌
వెంకట్‌ మూవీస్‌ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్య' కన్నడలో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీగా 30 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. 'దండుపాళ్యం' పేరుతో తెలుగులో విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అయి 10 కోట్లు కలెక్ట్‌ చెయ్యడమే కాకుండా శతదినోత్సవం జరుపుకొని సంచలనం సృష్టించింది. తెలుగు, కన్నడ భాషల్లో ఇంతటి ఘనవిజయం సాధించిన 'దండుపాళ్యం' టీమ్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'దండుపాళ్యం-2' చిత్రాన్ని నిర్మాత వెంకట్‌ చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి బిజినెస్‌ పరంగా చాలా పెద్ద క్రేజ్‌ వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత వెంకట్‌ సన్నాహాలు చేస్తున్నారు. 'బాహుబలి2', 'రోబో2' వంటి సీక్వెల్స్‌ రూపొందుతున్న టైమ్‌లోనే 'దండుపాళ్యం2' నిర్మించడం ఆనందంగా వుంది ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''తెలుగు, కన్నడ భాషల్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన 'దండుపాళ్యం' చిత్రానికి సీక్వెల్‌గా మా బేనర్‌లో నిర్మిస్తున్న 'దండుపాళ్యం-2' చిత్రానికి సినిమా ప్రారంభం నుంచే చాలా మంచి క్రేజ్‌ వస్తోంది. బిజినెస్‌ పరంగా చాలా పెద్ద ఆఫర్స్‌ వస్తున్నాయి. బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో తీసిన కీలక సన్నివేశాలు సినిమాకి చాలా పెద్ద హైలైట్‌గా నిలుస్తాయి. ఇండియాలోనే భారీ బడ్జెట్‌ చిత్రాలుగా 'బాహుబలి2', 'రోబో2' వంటి సీక్వెల్స్‌ రూపొందుతున్న సమయంలోనే మా 'దండుపాళ్యం2' నిర్మాణం జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. 'దండుపాళ్యం' కంటే పెద్ద హిట్‌ అయ్యే రేంజ్‌లో డైరెక్టర్‌ శ్రీనివాసరాజు 'దండుపాళ్యం2' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. ఆగస్ట్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. డెఫినెట్‌గా 'దండుపాళ్యం' కంటే 'దండుపాళ్యం2' పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుంది'' అన్నారు. 'దండుపాళ్యం2' ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ నిస్తుంది దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా రూపొందిన 'దండుపాళ్యం' తెలుగు, కన్నడ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో, కన్నడలో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించి సంచలనం సృష్టించింది. 'దండుపాళ్యం'లాగే ఈ చిత్రం కథ, కథనాలు కూడా చాలా రియలిస్టిక్‌గా వుంటాయి. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్‌ సినిమాలను అద్భుతంగా రిసీవ్‌ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు 'దండుపాళ్యం2' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది'' అన్నారు. బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌ జన్య, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.