మ‌ళ్లీ కేంద్ర ఆర్థిక శాఖ సంచ‌ల‌న నిర్ణ‌యం


కేంద్ర ఆర్థిక శాఖ పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో మరిన్ని వెసులుబాట్లు... కొన్ని కుదింపులు చేసింది. పెళ్ళిళ్లకు, రైతులకు కొన్ని వెసులు బాట్లను కల్పించింది. పాత నోట్లను మార్చుకునే పరిమితిని రూ.4,500 నుంచి రూ.2,000కు తగ్గించారు. ఇది రేపటినుంచి అందుబాటులోకి రానుంది. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా వివిధ వర్గాలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా కుటుంబాల నగదు విత్ డ్రా పరిమితిని రూ.2.5 ల‌క్ష రూపాయ‌లుకు పెంచారు. గుర్తింపు కార్డు చూపి (సెల్ఫ్ డిక్లరేషన్ల ) విత్ డ్రా చేసుకోచ్చు. రైతులు రుణ బీమా ప్రీమియం చెల్లింపుల గడువును 15 రోజుల పెంచారు. ఇందుకోసం ఆయా రైతులు కెవైసీ వివరాలు అందించాలి.  పంటరుణాలు పొందిన రైతులు, కిసాన్ క్రెడిట్ దారులు వారానికి 25 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. ఏపీఎంసీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లో రిజిస్ట్ర్ అయిన వారు వారానికి రూ.50వేలు విత్ డ్రా చేసుకోవచ్చు.