మరోసారి హీరోగా కనిపించబోతున్న టాలీవుడ్ కమేడియన్


శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన తొలి సినిమా ‘గీతాంజలి’ మరియు రెండో సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలో పూర్తి స్థాయి హీరోగా నటించినా కూడా అతను ఎక్కడా అతి చేయలేదు. రెచ్చిపోలేదు. కథతో పాటే ట్రావెల్ చేశాడు. సినిమాలో ఒక పాత్రధారిలాగే కనిపించాడు.

తాజాగా శ్రీనివాస్ రెడ్డి నటించిన  ‘ఆనందో బ్రహ్మ’సినిమాలో ముఖ్య పాత్రధారుల్లో అతనొకడు. తన స్థాయికి తగ్గ పాత్రల్లో.. చక్కటి అభిరుచితో.. ఆలోచనతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు శ్రీనివాసరెడ్డి. అదే సమయంలో కామెడీ వేషాలు కూడా వదులుకోలేదు. ఓ వైపు కమేడియన్ గా మరోవైపు హీరోగా నటిస్తూ కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నాడు.  శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం హీరోగా మరో సినిమాలో కనిపించబోతున్నాడు. రవి కుమార్ రెడ్డి నిర్మాణంలో బి మను దర్శకత్వం వహించబోయే సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిచబోతున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుండగా, ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందించనున్నాడు.