Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

Chota K Naidu For Sundeep Kishan


మ‌న ఇండస్ట్రీలో తమ వారసుల్ని ప‌రిచ‌యం చేయ‌డం కోసం కొంద‌రు నిర్మాత‌లు అవుతుంటే.. మ‌రికొంద‌రు తమ పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగుండాలని ఎన్నో సినిమా క‌థ‌లు విని, అంద‌రికీ న‌చ్చితే కానీ సెట్స్ పైకి తీసుకెళ్ల‌ట్లేదు. కానీ ఇక్క‌డ మావ‌య్య త‌న అల్లుడు  కోసం అస‌లు డ‌బ్బులే తీసుకోకుండా ఫ్రీగా ప‌నిచేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. సినిమాను తీసింది ఒక డెబ్యూటెంట్ డైరక్టర్. అయినా కూడా సినిమాలో ప్రతీ ఫ్రేమూ చాలా అనుభవం ఉన్న ఒక దర్శకుడు కూర్చినట్లు ఉంటుంది. అలాగే పాటలు కూడా అదిరిపోతాయి. విజువల్స్ అయితే చెప్ప‌క్క‌ర్లేదు. దానికి కారణం హీరో సందీప్ కిషన్ మామయ్య.. సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు. ఇక ఆయన గురించి చెప్పేదేముంది. తన మేనల్లుడి కోసం ఇంతటి అద్భుతమైన వర్క్ ను చేయడమే కాదు.. అసలు డబ్బులు కూడా తీసుకోవట్లేదట చోటా. ఆయన ఇప్పుడు మరోసారి అదే ఫీట్ ను చేస్తున్నాడు. ఈసారి కూడా సందీప్ కోసం ఫ్రీ గా పనిచేశాడు. ఇప్పటికే మనం చూసిన ''ఒక అమ్మాయి తప్ప'' ట్రైలర్ చాలా స్టయిలిష్ గా ఉంది. కెమెరా వర్కుచాలా బాగుంది. మరోసారి చోటా తన ప్రతిభను చూపించేశాడు. అయితే ఈసారి కూడా చోటా మామ డబ్బులు తీసుకోకుండా తన కోసం పనిచేశాడని.. తనకు ఋణ పడిపోయి ఉంటానని సందీప్ చెప్పుకొచ్చాడు. గతంలో చోట సహకారంతో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో భారీ హిట్టు కొట్టిన సందీప్.. త‌న మామ‌య్య ఆశీస్సుల‌తో నైనా ఫ్లాపుల నుంచి బ‌య‌ట పడ‌తాడో లేదో చూడాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.