Cherry Facing Competition From His Cousins


  రామ్ చ‌ర‌ణ్ కు త‌న ఫ్యామిలీ నుంచే కాంపిటిష‌న్
 
మెగాస్టార్ కి అస‌లు సిస‌లైన వార‌సుడిగా మెగాభిమానులు చెప్పుకునేది రామ్ చ‌ర‌ణ్ నే. కుటుంబంలో ఎంత మంది ఉన్నా, మెగాస్టార్, ప‌వ‌ర్ స్టార్ ల‌ను మించిన వాడు కావాల‌ని కోరుకుని, మెగాప‌వ‌ర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా మినిమ‌మ్‌ 40 కోట్లు రాబట్టగలడనే పేరున్నాఅంత‌కుమించి తీసుకెళ్లి, సినిమాని బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకెళ్లలేకపోతున్నాడు. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి చేరుకోవడానికి రామ్ చరణ్ కి బ‌య‌టి నుంచే కాదు,సొంత ఫ్యామిలీ నుంచి కూడా గ‌ట్టిపోటీనే ఉంది.
త‌న ఫ్యామిలీ హీరోలే త‌ను మిస్ చేసుకున్న కథలతో సినిమాలు తీస్తూ విజ‌యాలందుకుంటున్నారు. సరైనోడు సూపర్ హిట్ కొట్టారు బన్నీ బోయపాటి. మొదట చెర్రీతోనే బోయపాటి శ్రీను సినిమా తీయాల్సి ఉంది. పూజా కార్యక్రమాలు జరిపాక సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత సరైనోడుతో హిట్ కొట్టేశాడు అల్లు అర్జున్. క్రిష్ కూడా సేమ్ స్టోరీ. చరణ్ వద్దన్నాక వరుణ్ తేజ్ తో కంచె తీసేసి సూపర్ అనిపించేసుకున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా కూడా చెర్రీ కాదనగానే వరుణ్ తేజ్ కి చేరిపోయింది. సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా వరుసగా హిట్స్ కొట్టేస్తూ రేంజ్ పెంచుకుంటున్నాడు.
బన్నీ ఇప్పటికే వరుసగా యాభై కోట్ల షేర్ సాధించిన సినిమాలు నాలుగు ఇచ్చి టాప్ లీగ్ లో ఫిక్స్ అయిపోయాడు. చూస్తుంటే, చ‌ర‌ణ్ కి సొంతింటి నుంచే పోటీ పెరుగుతున్న‌ట్లు తెలుస్తూనే ఉంది. ఇకనైనా ఏడాదికో సినిమా మాత్ర‌మే చేసుకుంటూ వెళ్ల‌కుండా ఉంటే కానీ, ఇంత‌మందిని దాటెళ్లి మెగాస్టార్ వార‌సుడు అనిపించుకోలేడు రామ్ చ‌ర‌ణ్. చూద్దాం ఇక‌నైనా జాగ్ర‌త్త ప‌డ‌తాడేమో..