చెన్నయ్ చైత్రమా


కమల్ కల్యాణ్ మూవీ మేకర్స్ పతాకంపై సూర్య శ్రీనివాస్, అక్షయ్ కూరపాటి, దివ్య, ప్రవళ్లిక పద్రాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం "చెన్నయ్ చైత్రమా ".కమల్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలొ ఈ సినిమా తెరకెక్కుతొంది. ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా టైటిల్ లొగొ లాంఛ్ జరిగింది.నిర్మాతలు  రాజ్ కందుకూరి,  తుమ్మల్ల పల్లి రామ సత్యనారాయణ టైటిల్ లొగొను ఆవిష్కరించారు. 
chennai chitrama
హీరొలు సూర్య శ్రీనివాస్ , అక్షయ్  మాట్లాడుతూ.. ఓ మంచి లవ్ స్టోరీ చెస్తున్నాము. నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా చిత్రముంటుందన్నారు.
 
హీరొయిన్ దివ్య,  ప్రవల్లిక మాట్లాడుతూ.. టైటిల్ నుంచి,  ప్రతి పాత్ర వరకు దర్శకుడు కల్యాణ్ సూబర్బ్ గా డిజైన్ చెశారు. ఈ సినిమా లొ మేము భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు.
 
దర్శక నిర్మాత  కమల్ కల్యాణ్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ ను తీసిన రాజ్ కందుకూరి,  వంద సినిమాలకు చెరువవుతొన్న మెగా నిర్మాత రామ సత్యనాతాయణ గారు మా సినిమా టైటిల్ లొగొను ఆవిష్కరించటం ఆనందంగా ఉంది. మన దగ్గర ఉన్నదాంతో మనం సంతృప్తి పొందాలన్న కాన్సెప్ట్ తో "చెన్నయ్ చైత్రమా " రూపొందుతుంది. ఎక్కడ చిన్నపాటి అశ్లీలత లేకుండా కుటుంబమంతా కలిసి చూసెలా ఈ సినిమా ఉంటుందని అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. మంచి కథ,కథనాలతో కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా గా "చెన్నయ్ చైత్రమా " తెరకెక్కిస్తుండటం సినిమా పై కమల్ కల్యాణ్ కున్న అవగాహనకు నిదర్శనం. పెళ్లి చూపులు విజయం  చాలా మంది కి స్పూర్తి. అదే తరహాలొ చెన్నయ్ చైత్రమా కూడా సక్సెస్ సాదించాలి. చిన్న సినిమా బత్రకాలని అన్నారు.
 
 రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. దర్శక నిర్మాత కమల్ కల్యాణ్ మంచి ప్లానింగ్, కథతో ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ అందరు చూసెలా కంటెంట్ నమ్ముకుని చెస్తున్నారు. తనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నారు..