మ‌రోసారి చందూతో చైతూ..!


టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం రీమేక్ ల హ‌వా న‌డుస్తుంది. స్టార్ హీరో నుంచి చిన్న చిన్న హీరోల వ‌ర‌కూ అంద‌రూ అంద‌రూ రీమేక్ ల మీదే దృష్టి పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌, ద‌ర్శ‌కుడు చందూ మొండేటి మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యాన్ని సాధించిన ప్రేమ‌మ్ ను తెలుగులోకి మార్చ‌డంలో చాలా బాగా స‌క్సెస్ అయ్యారు. నిజం చెప్పాలంటే ప్రేమ‌మ్ లాంటి గొప్ప సినిమాను తెలుగులో ఆ ఫీల్ పోకుండా తెలుగులోకి అనువదించి స‌క్సెస్ అవ‌డ‌మంటే మాట‌లు కాదు. ఈసినిమా చూశాక ప్ర‌తి ఒక్క‌రూ ద‌ర్శ‌కుడు చందూని అభినందించిన‌వారే. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ హిట్ డైర‌క్ట‌ర్ త‌న త‌ర్వాతి సినిమాను అనౌన్స్ చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగానే ఉంది.

ఈ నేప‌థ్యంలోనే చందూ రీసెంట్ గా సిద్ధం చేసుకున్న త‌న క‌థ కోసం మ‌రోసారి మ‌ళ్లీ నాగ‌చైత‌న్య తోనే జ‌త‌కట్ట‌నున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.ఇప్ప‌టికే చైతూ కి స్టోరీని వినిపించగా, చైతూకు క‌థ న‌చ్చి, గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు చైతూ క‌నిపించ‌ని విధంగా కొత్త‌గా ప్రెజెంట్ చేయ‌నున్నాడ‌ట చందూ. అంతేకాదు మ‌రోసారి త‌న స్క్రీన్ ప్లే తో ప్రేక్ష‌కుల‌ను మాయ చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట చందూ మొండేటి.

అస‌లు ప్రేమ‌మ్ త‌ర్వాత నాగార్జునతో చందూ త‌ర్వాతి సినిమా ఉంటుంద‌ని భావించిన నేప‌థ్యంలో మ‌రోసారి చైతూతోనే జ‌త క‌ట్ట‌డం విశేషం. త‌నలోని టాలెంట్‌ను యాక్టింగ్ టాలెంట్‌ను, ప్రేక్ష‌కులు త‌న నుంచి ఏం ఆశిస్తున్నారో అది క‌రెక్ట్ గా ప్రెజెంట్ చేయ‌గలిగింది చందూనే అని భావించిన నాగ‌చైత‌న్య ఈ క‌థ విన్న వెంట‌నే ఓకే చెప్పాడంటున్నారు.ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య క‌ళ్యాణ్ కృష్ణ డైర‌క్ష‌న్ లో రారండోయ్ వేడుక చేద్దాం సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.