ఈ సినిమాలో చాలా కఠినమైన పాత్ర చేశాను


సరైనోడు, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాల్లో గ్లామర్ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరోయిన్ కాథరిన్. ఇప్పుడు ఈ భామ తమిళ నటుడు ఆర్యతో కలిసి ' గజేంద్రుడు' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవల్సి ఉండగా, తెలుగులో  కొన్ని అనివార్య కారణాల వాళ్ళ పోస్ట్ పోన్ చేయటం జరిగింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కాథరిన్ ఈ విధంగా మాట్లాడింది.


ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో చాలా కఠినమైన పాత్ర ఈ సినిమాలో చేశాను. ఈ చిత్రంలో గిరిజన మహిళగా కనిపించే నేను , సినిమా షూటింగ్ కోసం రోడ్ మార్గం కూడా సరిగా లేని అడవిలో పాల్గొన్నాను. ఖాళి నడకలో చాలా నడిచాను. షూటింగ్ అయిపోయాక ఇంటికి వెళ్లి చూసే వరకు శరీరంపై గాయాలు కనిపించేవి అని కాథరిన్ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికి గ్లామర్ పాత్ర కాకుండా ఇలాంటి చాలెంజింగ్ రోల్ ఎంచుకున్న కాథరిన్ ని పొగడాల్సిందే....