Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Campus Ampasayya In 4 Languages


నాలుగు భాషల్లో 'క్యాంపస్-అంపశయ్య'అమ్మా నీకు వంద‌నం', 'ప్రణయ వీధుల్లో' చిత్రాల ద్వారా తనలో డిఫరెంట్ ఫిలిం మేకర్ ఉన్నాడని నిరూపించుకున్నారు ప్రభాకర్ జైని. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ జైని తాజాగా 'క్యాంపస్ అంపశయ్య'  పేరుతో ఓ చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాకర్ జైని కూడా ప్రధాన పాత్ర చేశారు. శ్యామ్ కుమార్‌పావ‌ని హీరో హీరోయిన్ గా నటించారు. జైనీ క్రియేష‌న్స్‌ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని ఈ చిత్రాన్ని నిర్మించారు. 1969లో న‌వీన్ రాసిన 'అంపశయ్య' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత నవీన్ ఇంటి పేరు 'అంపశయ్య' అయిపోయింది. ఈ చిత్రవిశేషాలను ప్రభాకర్ జైని తెలియజేస్తూ - ''ఈ కథలో చక్కటి ఆత్మ ఉంది. విలువలున్నాయి. మానసిక సంఘర్షణలున్నాయి. తెలుగులో మాత్రమే కాదు.. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. అన్ని భాషలవాళ్లకీ సూట్ అయ్యే కథ ఇది. అందుకే ఇతర భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం. 'అంపశయ్య' నవల అందరికీ నచ్చింది. ఈ నవలను అందరికీ నచ్చే విధంగా తెరరూపం ఇవ్వడం జరిగింది. ఓ గ్రామం నుంచి ఉస్మానియా యూనివర్శిటీకి చదువుకోవడానికి వచ్చిన ఓ యువకుడి జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగే సంఘటనలతో ఈ సినిమా ఉంటుంది. కథానుగుణంగా ఉస్మానియా క్యాంపస్ లో కీలక సన్నివేశాలు తీశాం. ఈ క్యాంపస్ లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ఇదే. 1970ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించాం. అన్ని వర్గాల వారికీ నచ్చే చిత్రం అవుతుంది. జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.