Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

Calling Bell2 Built With HIgh Technical Standards


టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందనున్న హార్రర్‌ థ్రిల్లర్‌ 'కాలింగ్‌ బెల్‌ 2'
హార్రర్‌ థ్రిల్లర్స్‌కి, హార్రర్‌ కామెడీ మూవీస్‌ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్న సమయంలో రెగ్యులర్‌ హార్రర్‌ మూవీస్‌కి భిన్నంగా హార్రర్‌ మూవీస్‌ ఇలా కూడా వుంటాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా 'కాలింగ్‌బెల్‌' మూవీ విడుదలైంది. చిన్న చిత్రాల్లో, ముఖ్యంగా హార్రర్‌ చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. ప్రేక్షకులకు ఓ కొత్త తరహా హార్రర్‌ చిత్రాన్ని పరిచయం చేశారు దర్శకుడు పన్నా రాయల్‌. తను తయారు చేసుకున్న కథపై నమ్మకం, దానికి నిర్మాత అందించిన సహకారం తోడై 'కాలింగ్‌బెల్‌' ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత దానికి సీక్వెల్‌గా 'కాలింగ్‌బెల్‌2' చిత్రాన్ని చేస్తానని ప్రకటించిన పన్నా రాయల్‌ ఇప్పుడు ఆ ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. ఆ చిత్రం విడుదలైన తర్వాత కొంత గ్యాప్‌ తీసుకొని పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ చేసుకొని కాలింగ్‌ బెల్‌ సీక్వెల్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 'కాలింగ్‌బెల్‌' కంటే టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో 'కాలింగ్‌ బెల్‌2' చిత్రాన్ని తీసేందుకు పన్నా రాయల్‌ను అన్ని విధాలా సపోర్ట్‌ చేసే నిర్మాత లభించారు. ప్రొడక్ట్‌ బాగా రావాలి, బడ్జెట్‌ విషయంలో రాజీ పడొద్దు అనే నిర్మాత భరోసా అతనికి వుంది. అందుకే తన ఊహల్లోని 'కాలింగ్‌బెల్‌2' చిత్రాన్ని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు పన్నా రాయల్‌. డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అశోక్‌, రాజ్‌ దలవాయి నిర్మించే ఈ చిత్రాన్ని జూన్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు అశోక్‌, రాజ్‌ దలవాయి మాట్లాడుతూ - ''కాలింగ్‌బెల్‌ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన పన్నా రాయల్‌ ఆ చిత్రానికి సీక్వెల్‌గా చేస్తున్న 'కాలింగ్‌బెల్‌2' చిత్రాన్ని టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో నిర్మించేందుకు ప్లాన్‌ చేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా హాలీవుడ్‌ నుంచి కొంతమంది టెక్నీషియన్స్‌ని రప్పిస్తున్నాం. మా బేనర్‌లో చేయబోయే మొదటి సినిమా హార్రర్‌ చిత్రాల్లో ఓ ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ కావాలన్నది మా ఆకాంక్ష. జూన్‌ నెలలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం'' అన్నారు. దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ - ''కాలింగ్‌బెల్‌ మూవీ చాలా పెద్ద సక్సెస్‌ అయింది. సినిమా రిలీజ్‌ అయిన టైమ్‌లోనే నేను దీనికి సీక్వెల్‌గా 'కాలింగ్‌బెల్‌2' చేస్తానని చెప్పడంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని వెయిట్‌ చేస్తున్నామని కొంతమంది ఆడియన్స్‌ నాతో చెప్పడం సీక్వెల్‌ చెయ్యాలన్న నా ఉత్సాహం రెట్టింపు అయింది. దర్శకుడుగా నాకు మంచి పేరు తెచ్చిన 'కాలింగ్‌బెల్‌' చిత్రానికి కొంత టైమ్‌ తీసుకొని పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాను. ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీస్‌ నిర్మించాలన్న లక్ష్యంతో డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌ను స్థాపించి మొదటి చిత్రంగా 'కాలింగ్‌బెల్‌2' ను చేస్తున్నారు నిర్మాతలు అశోక్‌గారు, రాజ్‌ దలవాయిగారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ అవ్వొద్దని, బడ్జెట్‌ విషయం ఆలోచించవద్దని టెక్నికల్‌గా హై ఎండ్‌లో సినిమా వుండేలా తియ్యమని నన్ను ప్రోత్సహిస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమాలో నటించే నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం'' అన్నారు.