Breakup Songs On Girls Names


It is very common that songs in the names of hero heroine in tollywood. But if the song is on the name of hero it is used for heroism and if on heroines it is used for teasing songs generally.now we got a new trend from this year. Girls names are using for sad songs now a days.
In the movie 'Nenu Sailaja' which released on Jan 1st 2016 there is a song named Sailaja Sailaja. There is a song in A Aa movie also which released recently. But in this movie comedian praveen sings his love failure song called Shyamala.
                                                                  అమ్మాయిల పేర్ల‌తో బ్రేకప్ సాంగ్స్
హీరో, హీరోయిన్ల క్యారెక్ట‌ర్ల పేర్ల‌తో పాట‌లు ఉండ‌టం మ‌న టాలీవుడ్ లో కొత్త విష‌య‌మేమీ కాదు. కానీ ఇలాంటి పాట‌లు హీరోల పేరుతో వ‌స్తే వాళ్ల హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉండ‌టం, అదే హీరోయిన్ పేరుతో అయితే వాళ్ల‌ను ఏడిపించే పాట‌లు పెట్టుకుంటూ వాడ‌టం మ‌న టాలీవుడ్ కే చెందుతుంది. అయితే ఇదంతా గ‌తేడాది వ‌ర‌కు. ఈ సంవ‌త్స‌రం కొత్త ట్రెండ్ వ‌చ్చింది. అమ్మాయిల పేర్లు ఏడుపు పాట‌ల‌కే అంకితం చేస్తున్నారు.
2016 కొత్త సంవ‌త్స‌రం రోజున విడుద‌లైన ఎన‌ర్జిటిక్ హీరో రామ్ మూవీ నేను.. శైల‌జ‌, ఈ సినిమాలో హీరోయిన్ తో బ్రేకప్ అయిన త‌రుణంలో వ‌చ్చే శైల‌జా శైల‌జా సాంగ్ ఉంటుంది. మొన్నీ మ‌ధ్య రిలీజైన అ..ఆ లోనూ ఇదే ప‌రిస్థితి. హీరోయిన్ స‌మంత‌ను ప్రేమించ‌లేన‌ని హీరో నితిన్ చెప్పిన త‌ర్వాత ఒక పాట వ‌స్తుంది. కాక‌పోతే ఈసారి హీరోతో కాకుండా, హీరో ప‌క్క‌నే ఉన్న క‌మెడియ‌న్ కి ఓ ఫెయిల్యూర్ ల‌వ్ స్టోరీ ఉందంటూ ప్ర‌వీణ్ ఏడ్చుకుంటూ శ్యామ‌లా... శ్యామలా అంటూ పాడుతుంటే, నితిన్ డ్యాన్సులేసుకుంటూ సమంతతో తన బ్రేకప్ గురించి చెప్పే పాట ఇది. మొత్తానికి ఈ ఏడాది అమ్మాయి పేర్లు ఇలా బ్రేకప్ సాంగ్స్ కి ఏడ్చుకోవడానికే పరిమితం చేసేయడం ఆలోచించాల్సిన విషయం కదూ.