Boyapati Planning Star Heroes Guest Role In His Upcoming Movie


స్టార్ హీరోల వెంట ప‌డుతున్న బోయ‌పాటి..
 
త‌న కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించి స‌మ్మ‌ర్ కి స‌రైనోడు అనిపించుకున్నాడు బ‌న్నీ. ఇప్ప‌టికే 70కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను సాధించిన ఈ మూవీ, ఇప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్సే రాబ‌డుతుంది. కేవ‌లం బన్నీనే కాదు ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ సాధించిన వ్య‌క్తుల్లో ఇంకొక‌రు కూడా ఉన్నారు. డైర‌క్ట‌ర్ బోయ‌పాటి. లెజెండ్ , సరైనోడు ఇలా వరుస హిట్స్ తో ఈయ‌న‌పై బాధ్య‌త‌లు మ‌రింత పెరిగాయి. ఈయ‌న చేసిన సినిమాల‌న్నీ స్టార్ హీరోస్ తోనే. కానీ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాత్రం ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో నిల‌దొక్కుకుంటున్న ఓ కుర్రాడితో చేస్తున్నాడు. ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయ‌పాటి నెక్స్ట్ మూవీ. ప్రెజెంట్ టాప్ రేంజ్ లో ఉన్న త‌న ఇమేజ్ ను బెల్లంకొండ లాంటి కుర్రాడితో త‌గ్గించుకోవ‌డం బోయ‌పాటికి ఇష్టం లేద‌నుకుంటా. కానీ ఏం చేస్తాడు పాపం ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్త‌యిపోయాయి.
అందుకేనేమో బెల్లంకొండతో చేయనున్న మూవీకి స్టార్ వాల్యూను జత చేసేందుకు బోయ‌పాటి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు స్టార్ హీరోలతో గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించేలా స్క్రిప్ట్ ను మార్చుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తో తలపెట్టిన మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినా.. ఇప్పుడు ఓ ఇద్దరు యంగ్ స్టార్ హీరోలతో గెస్ట్ రోల్స్ చేయించేలా స్క్రిప్ట్ మార్చుతున్నాడట బోయపాటి శ్రీను. చూద్దాం బోయ‌పాటి ఏం ప్లాన్ వేస్తాడో.. త‌న ఇమేజ్ ను ఎలా పెంచుకుంటాడో..