మ‌హేష్‌-కొర‌టాల‌.. ట్రాక్ లోకి మ‌రో కొత్త హీరోయిన్


 మ‌హేష్ బాబు కొత్త సినిమా మొద‌లుపెడుతున్నాడు అన‌డం ఆల‌స్యం ఆ సినిమాలో హీరోయిన్ ఈమే అంటూ ఎవ‌రు ట్రెండింగ్ లో ఉంటే ఆ హీరోయిన్ పేరు వినిపించ‌డం ష‌రా మామూలే. అటు దీపికా ప‌దుకునే నుంచి ఇటు కీర్తి సురేష్ దాకా అంద‌రి పేర్లూ వినిపిస్తాయి. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ డైర‌క్ష‌న్ లో సినిమా చేస్తున్న మ‌హేష్, ఈ సినిమా తర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను మొద‌లుపెట్ట‌నున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్ప‌టికే ప‌రిణీతి చోప్రా, దిశా ప‌టానీల పేర్ల‌యితే వినిపించాయి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. 


ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు మ‌హేష్ తో జోడీ క‌ట్టే హీరోయిన్ గా ఒక కొత్త పేరు వినిపిస్తుంది. అలా రేస్ లోకి వ‌చ్చిన ఆ హీరోయిన్ పేరు కైరా అద్వానీ. అయితే మ‌హేష్ ఇప్ప‌టివ‌ర‌కు తాను గ‌తంలో బాలీవుడ్ భామ‌ల‌తో చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్ అవ‌డంతో, ఇక్క‌డి హీరోయిన్స్ తోనే జోడీ క‌ట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నాడు. మ‌హేష్‌కి ఈ ఆలోచ‌న రావ‌డం ఎంత మామూలో, ప్ర‌తీసారి మ‌హేష్ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపించడం కూడా అంతే మామూలుగా మారిపోయింది. ఏదేమైనా మ‌హేష్ ప‌క్క జోడీ క‌ట్టే ఆ ఛాన్స్ ఎవ‌రు కొట్టేస్తారో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.