Latest News

ప్ర‌తీ అమ్మాయి చూడాల్సిన చిత్రం నా ల‌వ్‌స్టోరీ - మోష‌న్ పోస్ట‌ర్ లాంఛ్ లో డైర‌క్ట‌ర్ శివ‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన 'రెబల్ స్టార్' ప్రభాస్ మోస్ట్ క్రేజియ‌స్ట్ ప్రోజెక్ట్ "సాహో" ఫ‌స్ట్ లుక్... 'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్

Bitragunta-The Beginning Starts from June 15th


జూన్‌ 15 నుండి 'బిట్రగుంట (ది బిగినింగ్‌)' జాలె ఫిలింస్‌ పతాకంపై జె.వి. నాయుడు ప్రధాన పాత్రలో నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రైమ్‌ రిలెటెడ్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ 'బిట్రగుంట'. ది బిగినింగ్‌ అనేది ఉపశీర్షిక. ఎల్లసిరిమురళీధర్‌ రెడ్డి, ఇషిక హీరోహీరోయిన్‌లుగా తొలి పరిచయంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జూన్‌ 15 నుండి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిసర ప్రాంతాలలో షూటింగ్‌ జరుపనున్నారు. గతంలో ప్రేమలో ఎబిసి, లంగావోణి చిత్రాల దర్శకుడు నాగరాజు తలారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నాగరాజు తలారి మాట్లాడుతూ...'దారి దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసే రెండు గ్యాంగుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ గ్యాంగ్‌లకు, పోలీసులకు మధ్య జరిగే ఛేజింగ్‌లతో ఈ చిత్రాన్ని అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో తెరకెక్కించడం జరుగుతుంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అత్యంత ప్రధాన్యత సంతరించుకున్న ఈ చిత్రం జూన్‌ 15 నుండి షూటింగ్‌ జరుపుకోనుంది..' అని అన్నారు. చిత్ర నిర్మాత జె.వి. నాయుడు మాట్లాడుతూ..'మా డైరెక్టర్‌ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథను ఖర్చుకు వెనకాడకుండా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా రియాలిటీగా తెరకెక్కేందుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ తో కూడా సంప్రదింపులు జరపనున్నాం. నెల్లూరు జిల్లాలో ఎక్కువభాగం షూటింగ్‌ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. జె.వి. నాయుడు ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కరుణాకర్‌, నిర్మాత: జాలె వాసుదేవనాయుడు, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: నాగరాజు తలారి.